Olympics 2024 : ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు.. మను భార్క్ సరికొత్త రికార్డ్.. భారత్ ఖాతాలో మరో కాంస్యం..!
ప్రధానాంశాలు:
Olympics 2024 : ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు.. మను భార్క్ సరికొత్త రికార్డ్.. భారత్ ఖాతాలో మరో కాంస్యం..!
Olympics 2024 : పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత్ మరొ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత షూటర్లు తమ సత్తా చాటి కాస్యాన్ని గెలుపొందారు. ఒలంపిక్స్ లో ఆల్రెడీ ఇప్పటికే కాంస్య పతకం సాధించిన మను భాకర్ సోలో షూటింగ్ లో కాంస్యాన్ని తెచ్చింది. ఇక ఇప్పుడు డబుల్స్ లో తన కో షూటర్ సరర్బోత్ తో కలిసి మరో కాంస్య పతకాన్ని అందించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిస్కెడ్ ఈవెంట్ లో మను, సరర్బోత్ ద్వయం కాంస్యాన్ని గెలుపొందారు.ఇప్పటికే మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను కాస్యాన్ని గెలుపొందగా ఇప్పుడు మిక్సెడ్ ఈవెంట్ లో కూడా సరర్బోత్ సింగ్ తో కలిసి భారత్ కు మరో కాంస్యాన్ని అందించింది మను భాకర్. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ లో మను భాకర్, సరర్బోత్ అద్భుతమైన ప్రదర్శన కనబరచి భారత్ కు కాంస్య పతకాన్ని అందించారు.
Olympics 2024 ఒక ఎడిషన్ లో రెండు పతకాలతో చరిత్రకెక్కిన మను భాకర్..
ఐతే ఒకే ఒలంపిక్స్ లో ఇలా రెండు పతకాలను తెచ్చి ఇదివరకు ఎవరు సృష్టించని అరుదైన రికార్డుని సృష్టించింది మను భాకర్. ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలను సాధించిన మహిళా అథ్లెట్ గా మను భాకర్ రికార్డ్ సృష్టించింది. భారత్ లో ఏ ఎడిషన్ లో కూడా ఒకటి కంటే ఎక్కువ పతకాలు ఎవరు సాధించలేదు. ఇక మను భాకర్ తో పాటుగా కాంస్యం గెలవడానికి కారణమైన సరర్బోత్ సింగ్ భారత్ నుంచి పతకం సాధించిన ఆరో షూటర్ గా నిలిచాడు.
భారత్ నుంచి షూటింగ్ విభాగంలో పతకం సాధించిన ఐదో షూటర్ గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఐతే ఏ ఒక్క ఎడిషన్ లో కూడా ఇలా ఒక అథ్లెట్ రెండు పతకాలను సాధించిన సందర్భం అయితే లేదు. దీనికి మను భాకర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశం మొత్తం ఆమెను చూసి గర్వపడుతుంది. మను భాకర్ దేశ గౌరవాన్ని ఒలంపిక్స్ లో కాపాడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.