Olympics 2024 : పారిస్ ఒలంపిక్స్ లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్ లో కాంస్యం తో చరిత్ర సృష్టించిన మను భాకర్..!
ప్రధానాంశాలు:
Olympics 2024 : పారిస్ ఒలంపిక్స్ లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్ లో కాంస్యం తో చరిత్ర సృష్టించిన మను భాకర్..!
Olympics 2024 : పారిస్ ఒలంపిక్స్ 2024 ఈమధ్యనే మొదలయ్యాయి. ఈ క్రీడల్లో సత్తా చాటేందుకు భారత్ తరపున చాలామంది ఆటగాళ్లు వెళ్లారు. ఐతే ఈ విశ్వ క్రీడలు ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా ఇండియాకు ఒక్క పతకం కూడా రాలేదు. ఐతే మూడో రోజున భారత్ ఖాతాలో ఒక కాంస్య పతకం వచ్చింది. పారిస్ ఒలంపిక్స్ 2024 లో భారత్ బోణీ కొట్టింది. భారత షూటర్ మను భాకర్ షూటింగ్ లో కాంస్య పతకాన్ని అందుకున్నారు.
Olympics 2024 మను భాకర్ బోణీ
ఒలంపిక్స్ 2024 లో మొదటి పతకం కావడంతో యావర్ భారత దేశం సంబరాల్లో మునిగితేలుతుంది. ఆదివరం చటీరోక్స్ షూటింగ్ సెంటర్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ లో మను భాకర్ Manu bhaker మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. అంతేకాదు షూటింగ్ విభాగంలో తొలి మోడల్ సాధించిన మోటి మహిళా షూటర్ గా మను భాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనల్ షూటింగ్ లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఐతే ఈ పోటీలో దక్సిణ కొరియా షూటర్లు ఓహ్ హేజిన్ 243.2 పాయింట్లతో స్వర్ణ పతకం.. కిం యేజే 241.3 పాయింట్లతో రజత పతకం గెలుచుకున్నారు. ఈసారి ఒలంపిక్స్ లో ఎక్కువ పతకాలను తీసుకు రావాలని భారత క్రీడాకారులు గురి పెట్టుకుని ఉన్నారు.
ఐతే కాంస్యంతో మొదలైన ఈ ఒలంపిక్స్ లో భారత్ అత్యధిక పతకాలను సాధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే మన ఆటగాళ్లంతా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. పివి సింధు కూడా బ్యాడ్మింటన్ లో దూసుకెళ్తుంది. లాస్ట్ టైం చివరివరకు పొరాడి పతకాలను కోల్పోయిన వారు ఈసారి తప్పకుండా పతకం గెలిచి వచ్చేలా కృషి చేస్తున్నారు. స్వర్ణం, రజతం, కాస్యం ఇలా మూడిటిలో ఏదో ఒకటి గెలిచేలా క్రీడాకారులు కృషి చేస్తున్నారు.