Medicine : మరికొన్ని రోజుల్లో ఘననియంగా పెరగనున్న మందులు ధరలు…సామాన్యులకు మరింత కష్టాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Medicine : మరికొన్ని రోజుల్లో ఘననియంగా పెరగనున్న మందులు ధరలు…సామాన్యులకు మరింత కష్టాలు…!

Medicine : ప్రస్తుతం ఆధునిక యుగంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయం కూడా సవాల్లతో కూడినది అవుతుంది. ఎందుకంటే దేశంలో నిత్యవసర సరుకుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని కూడా విపరీతంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇంట్లో అవసరాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా కొనాలి అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటు అవసరం తీరక ఆర్థిక స్తోమత సరిపోక ప్రజలు సహమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే […]

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,1:00 pm

Medicine : ప్రస్తుతం ఆధునిక యుగంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయం కూడా సవాల్లతో కూడినది అవుతుంది. ఎందుకంటే దేశంలో నిత్యవసర సరుకుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని కూడా విపరీతంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇంట్లో అవసరాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా కొనాలి అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటు అవసరం తీరక ఆర్థిక స్తోమత సరిపోక ప్రజలు సహమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. దీనివలన సామాన్య ప్రజలకు మరింత భారం పెరిగే అవకాశంం కనిపిస్తుంది. అదేంటంటే మరికొన్ని రోజుల్లో నిత్యవసర మందులు ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఇక ఈ విషయం ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇక నుంచి అనారోగ్యంతో మెడికల్ షాప్ వద్దకు వెళ్లాలంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే అత్యవసర మందుల ధరలు అనేవి ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఇక వీటిలో పెయిన్ కిల్లర్స్ మందుల నుండి యాంటీబయటిక్ మందుల వరకు అన్నీ ఉన్నాయి. అయితే వార్షిక ధరల సూచి డబ్ల్యూపిఐ మార్పుకు అనుగుణంగా మందుల కంపెనీలు ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచాలని ఫార్మా పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఈ టోక్ ధరలు సూచికలు వార్షిక మార్పులకు అనుగుణంగా 0055% ధరల పెరుగుదలకు అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి గత సంవత్సరం 2022 2023లో నేషనల్ లిఫ్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ( NLEM ) కింద మందుల ధరలు ఏకంగా 10 నుంచి 12%శాతం పెరిగాయి. ఇక ఈ మందుల జాబితాలో పారాసెటమల్, అజిత్రోమైసిస్, యాంటీబయాటిక్స్ , రక్తహీనత నిరోధక మందులు , విటమిన్లు వంటి మందులు కూడా ఉన్నాయి. అలాగే ఈ జాబితాలో కోవిడ్ 19 రోగులకు మధ్యస్థంగా చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అయితే పరిశ్రమలు పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల వలన ధరలు గనియంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది సామాన్య ప్రజలకు కచ్చితంగా మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పాలి. మరి ఇప్పుడు పెరుగుతున్న నిత్యవసర సరుకులతో పాటు నిత్యవసర మందులపై కూడా ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది