దారుణం.. మందులు కొనుక్కోలేని దీన స్థితిలో మహిళ మృతి
నార్నూర్: జ్వరం వస్తే కనీసం మందులు కొనుక్కోవడాని కూడా డబ్బులు లేని ధీన స్థితి వారిది. వారం రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతూ గృహిణి శుక్రవారం మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగచూసింది. చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముక్తాపూర్ కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం ధర్మిబాయి (37) గత వారం రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతుంది.
రెండురోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించారు. కానీ వారిది పేదకుటుంబం కావడంతో డబ్బులు లేకపోవడంతో ఎలాంటి టెస్టులు చేయించలేక పోయారు. మరునాడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా ఉదయం నుంచి కురుస్తున్న వార్షానికి ఆసుపత్రికి వెళ్లడానికి సాధ్య పడలేదు. పరిస్థితి విషమించి ఆత్రం ధర్మిబాయి మృతి చెందింది.