Rakhi Festival : ఈ రాఖీ పండుగ రోజు మీ సోదరికి ఫైనాన్షియల్ గిఫ్ట్ ఇచ్చి మెస్మరైజ్ చేయండి…!
Rakhi Festival : రక్షాబంధన్ rashka bandhan, రాఖీ పండుగ పేర్లు ఎన్నో అయినా చేసుకునే ఈ బంధము చాలా విలువైనది. మన అన్న కానీ తమ్ముడు కానీ మనకు రక్షగా ఉండాలని కోరుకుంటూ ఆ తమ్ముడు లేదా అన్న ఎల్ల కాలము చాలా సంతోషంగా ఉండాలని బంధనాన్ని కడుతుంది. ఇది ఇప్పటినుంచే కాదండి. పూర్వకాలం నుంచి కూడా వస్తుంది. శ్రీకృష్ణుడికి దౌపతి కూడా అరణ్యవాసంలో ఉండగా కట్టింది. ఇలా ఎన్నో రకాలుగా జరుపుకునే ఈ పండుగ మనకి ఆగస్టులో ఎప్పుడు వస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఆగస్టు 30న వచ్చింది. రాఖీ కట్టి చెల్లెలు అన్న నుంచి మంచి గిఫ్ట్ ఆశించడం సహజమే. అయితే అన్న లేదా తమ్ముడు ఓ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఏడాది కొత్తగా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది.
ప్రతి ఏడాది లాగా కాకుండా ఈ ఏడాది ఆడపిల్లల భవిష్యత్తు వారి అవసరాలను తీర్చేలా ఆర్థికపరమైన బహుమతి ఇస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి బహుమతి కూడా ఉంటుందా అని మీరు అనుకుంటున్నారా.? మీ అక్క చెల్లెలకి ఆర్థికపరమైన ఎసులుబాటు కలిగేలా కొన్ని బహుమతులు ఇవ్వచ్చని కొందరు సలహాలు ఇచ్చారు. అవేంటో మనం తెలుసుకుందాం.. స్టాక్స్: ఈ స్టాకులను బహుమతిగా ఇవ్వడం కూడా మంచిదే. మీరు దీర్ఘకాల పెట్టుబడితో బ్లూ చీప్ కంపెనీల స్టాక్ లను గిఫ్ట్ గా ఇవ్వచ్చు.. ఇలా ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏఎస్ఐపీల నుంచి వైద్య బీమా వరకు ఆర్థిక గిఫ్ట్ లను పరిగణలోకి తీసుకోవడం వలన సోదరులు తమ అక్క చెల్లెలు ఆర్థిక స్వాతంత్రం భద్రతను ఇచ్చిన వారు అవుతారు.
డిజిటల్ గోల్డ్: భౌతిక బంగారాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి బదులుగా డిజిటల్ గోల్డ్ మీ సోదరులకు గిఫ్ట్ గా ఇవ్వడానికి మరొక మంచి ఆలోచన.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ : మ్యూచువల్ పండ్స్ లోఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి ఏఎస్ఐపీలు సమర్థవంతమైన మార్గాన్ని కల్పించారు. దీని ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం చాలా సులభం అవుతుంది. మీ అక్క చెల్లెలకు వారి ఆశలు నెరవేర్చేందుకు ఇది మంచి గిఫ్ట్ గా ఉపయోగపడుతుంది.
హెల్త్ బీమా పాలసీ: మీ అక్క చెల్లెల్లు వారి ఆరోగ్యానికి పూర్తి భద్రతను ఏదైనా సమగ్ర ఆరోగ్య భీమా పాలసీ చేయించడం మంచి ఎంపిక. ఆకస్మాత్తుగా వచ్చే వ్యాధుల నుంచి వారిని రక్షించడానికి ఈ పాలసీ తీసుకోవడం చాలా మంచిది.