Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!
ప్రధానాంశాలు:
Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని పలు రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ఒక్కరోజు మాత్రమే ఈ ఫెసిలిటీని అందించగా, మరికొన్ని రాష్ట్రాలు మూడురోజుల పాటు ఈ ప్రత్యేక ప్రయాణ అవకాశాన్ని కల్పించాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలు వెలువరించాయి.

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!
Rakhi Festival : ఉచిత బస్సులు..
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన ఈ పథకం ప్రకారం, ఆగస్టు 8 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 రాత్రి వరకు యూపీఎస్‌ఆర్టీసీ మరియు సిటీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. రద్దీ నియంత్రణ కోసం అదనపు బస్సులు కూడా నడపనున్నారు. సీఎం నయాబ్ సింగ్ సైనీ రాఖీ సందర్భంగా ఒకరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించారు. ఆగస్టు 8 మధ్యాహ్నం నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు మహిళలు మరియు 15 ఏళ్లలోపు పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రకారం, ఆగస్టు 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం లభిస్తుంది. ఈ ప్రయాణ సదుపాయం రాజ్య సరిహద్దుల వరకే పరిమితం అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛండీగఢ్: ప్రత్యేక శుభాకాంక్షలతో ఉచిత ప్రయాణం అందించడమే కాకుండా, లాడ్లీ బెహ్నా యోజన లబ్ధిదారులకు అదనంగా ₹250 బోనస్‌ను ప్రకటించింది. అలాగే ఉత్తరాఖండ్ మరియు ఛండీగఢ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రాఖీ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించాయి.