New Pensions : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించిన మంత్రి
New Pensions : కేసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ పొందే వారికి చక్కని అవకాశం రానుంది. అర్హులైన అందరికీ పెన్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ కొత్త పెన్షన్ ను అందేలా చేస్తామన్నారు. అయితే ఈ కొత్త పెన్షన్ ను ను ఆగస్టు మొదటి వారం నుంచి ఇస్తామని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఐదు రకాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఆ ఐదు రకాల రంగాల వారికి ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
మొదటిది హరిత విప్లవం వలన వ్యవసాయం ఒక పండగ లాగా మారిందని అన్నారు. దీనికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పదివేల ఎకరాల్లో రావాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో చేపలు తక్కువగా దొరికేవి. కానీ ఇప్పుడు ఫిషరీస్ లో ఇండియా నంబర్ వన్ గా మారింది అన్నారు. కొత్తగా కట్టుకున్న రిజర్వాయర్లు, మిషన్ భగీరథ వలన ఇది సాధ్యమైంది అన్నారు. మీట్ ప్రాసెసింగ్ రావాలని, మీట్ ఇండస్ట్రీ ఇండియాకి మాత్రమే కాకుండా వేరే దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి అని అన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుమ, గొల్ల సోదరులకు గొర్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారని వారికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తామన్నారు ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.