KTR – MLA Shankar Naik : KTR చేసిన పనికి ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది .. అందులో తప్పేముంది సారూ !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: July 2, 2023, 11:00 am

KTR – MLA Shankar Naik : మంత్రి కేటీఆర్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇలా అంటే ఎలా అంటారా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. నిజానికి అది కోపం కాదు. అసహ్యం అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. ఇటీవల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి అడుగుపెట్టగానే మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అక్కడికి వెళ్లి మంత్రికి స్వాగతం పలికారు. ఇక.. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేను చూడగానే కోపంతో రగిలిపోయారు. కాన్వాయ్ దిగి కేటీఆర్ సభా ప్రాంగణానికి వెళ్తుండగా ఇంతలో వెనుక నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరుగు పరుగున వచ్చి మంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. దీంతో ఒక్క చూపు చూసిన మంత్రి కేటీఆర్.. చీదరించుకుంటూ ఎమ్మెల్యే చేయిని తోసేశారు.

Minister KTR Refuses To Give Shake Hand To MLA Shankar Naik

Minister KTR Refuses To Give Shake Hand To MLA Shankar Naik

KTR – MLA Shankar Naik : నెట్టింట వీడియో వైరల్

మంత్రి కేటీఆర్ చీదరించుకునే ప్రయత్నం చేయడంతో సార్ నాపై దయతలచండి సార్ అన్నట్టుగా ఎమ్మెల్యే చేతులు జోడించారు. అయినా కూడా మంత్రి కేటీఆర్ కు కోపం తగ్గలేదు. దీంతో తన చేతులు అలాగే జోడించి ఎమ్మెల్యే ముందుకు కదిలారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది. ఎందుకు మంత్రి కేటీఆర్.. మహబూబాబాద్ ఎమ్మెల్యేను చూసి అంతలా చీదరించుకున్నారు అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. దానికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp