Pensions And Ration Cards : కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!
ప్రధానాంశాలు:
Pensions And Ration Cards : కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!
Pensions And Ration Cards : ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ సమరం నడుస్తోంది. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారాలు చేస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ ఎస్, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటు వైపు బీజేపీ కూడా కేంద్రంలో మోడీ రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తోంది. బీఆర్ ఎస్ కూడా ఆ రెండు పార్టీలకు తగ్గట్టే ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇంకా అమలు చేయలేదని.. కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దంటూ కోరుతోంది. ఇంకోవైపు బీజేపీ కేంద్రంలో చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దంటూ కోరుతోంది.
Pensions And Ration Cards హుస్నాబాద్ లో పర్యటన..
ఈ క్రమంలోనే కాంగ్రెస్ మీద ఎక్కువగా ఆరు గ్యారెంటీలు ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. దాంతో ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఆరు గ్యారెంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. కేవలం రూ.2వేల పింఛన్ మాత్రమే ఇచ్చిందని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా రూ4వేలు ఇస్తుందని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని అమలుచేస్తామన్నారు. అంతే కాకుండా రేషన్ కార్డులపై కూడా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని.. ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో మాత్రం కచ్చితంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి.. కోడ్ అయిపోయిన వెంటనే కొత్త రేషన్ కార్డులపై ప్రకటన విడుదల చేస్తామన్నారు. అంతే కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. దాంతో పాటు మిగిలిన గ్యారెంటీలను కూడా అమలు చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కు పౌరసరఫరాల శాఖతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు పూర్తి సమాచారం ఉంటేనే ఇలాంటి కామెంట్లు చేస్తారని అంటున్నారు.