Nara Lokesh : లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
Nara Lokesh : టీడీపీ యువనేత నారా లోకేశ్.. యువగళం పేరుతో ఈరోజు నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు రాష్ట్రమంతా కవర్ అయ్యేలా ఆయన పాదయాత్ర ఉండనుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ పాదయాత్ర జరగనుంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ కు అండగా ఉండేందుకు టీడీపీకి చెందిన పలువురు నేతలు కుప్పానికి చేరుకున్నారు. పాదయాత్రలో నారా లోకేశ్ వెంట నడుస్తున్నారు. అయితే.. లోకేశ్ బాబు పాదయాత్రకు తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదు.
అసలు టీడీపీ పార్టీయే చంద్రబాబుది. అటువంటి చంద్రబాబు.. అదే పార్టీకి చెందిన నేత పాదయాత్ర చేస్తుంటే వెళ్లాలి కదా.. ఆ వేడుకను ప్రారంభించాలి కదా. కానీ.. చంద్రబాబు మాత్రం వెళ్లలేదు. దానికి కారణం.. లోకేశ్ కు పట్టాభిషేకం చేయడం కోసమేనట. ఎందుకంటే.. చంద్రబాబును కాకుండా లోకేశ్ బాబును హైలెట్ చేయడం కోసమేనట. ఒకవేళ చంద్రబాబు వెళ్తే అక్కడ చంద్రబాబే హైలెట్ అవుతారు కానీ.. లోకేశ్ కారు.. అందుకే.. లోకేశ్ బాబును హైలెట్ చేయాలి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అతడిని ముఖ్యమంత్రిని చేయాలంటే.. లోకేశ్ మీద అందరూ ఫోకస్ చేయాలి. మీడియా ఫోకస్ కూడా ఆయన మీదే ఉండాలి అని చంద్రబాబు భావిస్తున్నారట.
Nara Lokesh : కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వెనకడుగు వేసిన చంద్రబాబు
నారా లోకేశ్ ను రాజకీయంగా ఎదిగేలా చేయడం కోసమే, రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈ పాదయాత్ర ద్వారా లోకేశ్ చాలా విషయాలు నేర్చుకుంటారని.. వాటి ద్వారా రానున్న రోజుల్లో రాజకీయాల్లో రాటుదేలుతాడని చంద్రబాబు భావిస్తున్నారట. ఏది ఏమైనా.. లోకేశ్ తో పాటు టీడీపీ భవిష్యత్తునే మార్చనున్న ఈ పాదయాత్రకు చంద్రబాబు వెళ్లకుండా ఉండటంపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. చూద్దాం మరి లోకేశ్ పాదయాత్ర ఎంత మేరకు టీడీపీకి కలిసి వస్తుందో?