ChandraBabu : చంద్రబాబు ఎవరిని కలుస్తున్నాడో తెలుసా.. జగన్ కి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ChandraBabu : చంద్రబాబు ఎవరిని కలుస్తున్నాడో తెలుసా.. జగన్ కి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా !

 Authored By kranthi | The Telugu News | Updated on :30 January 2023,9:40 am

ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం నర సమయం కూడా లేదు. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ పార్టీలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. ఈనేపథ్యంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి అధికార వైసీపీని ఓడించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ల పొత్తులు కన్ఫమ్ అయినట్టే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి.. బీజేపీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీకి కోపం తెప్పించే పనులు చాలానే చేస్తుంది.

chandrababu to meet congress chief kharge to join in jodo yatra

chandrababu to meet congress chief kharge to join in jodo yatra

ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తాజాగా కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి ఆహ్వానం అందిందట. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే.. టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. సోమవారం నాడు శ్రీనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ముగిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ముగింపు సభలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందిందట. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే టీడీపీతో పాటు 23 పార్టీలకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపటితో ముగియనుంది. శ్రీనగర్ లో ముగింపు సభ ఉంటుంది.

chandrababu to meet congress chief kharge to join in jodo yatra

chandrababu to meet congress chief kharge to join in jodo yatra

ChandraBabu : టీడీపీతో పాటు 23 పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ లేఖ

ఈ సభకు అందరూ రావాలని 21 పార్టీల చీఫ్ లకు ఖర్గే లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా లేఖ అందిందట. అలాగే.. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్, మాయావతి, హేమంత్ సోరెన్ కూడా లేఖ రాసిందట కాంగ్రెస్ పార్టీ. ఈనేపథ్యంలో చంద్రబాబు.. ఆ సభకు వెళ్తారా అనేది సస్పెన్సే. కానీ.. చంద్రబాబు ఈ సభకు వెళ్లకపోవచ్చు.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్ల టీడీపీ భారీగా నష్టపోయిందని.. ఇంకోసారి ఆ తప్పు టీడీపీ చేయదని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది