Minister RK Roja : వైయస్ జగన్ నాలుగు సంవత్సరాల పాలనపై మంత్రి రోజా సంచలన కామెంట్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister RK Roja : వైయస్ జగన్ నాలుగు సంవత్సరాల పాలనపై మంత్రి రోజా సంచలన కామెంట్స్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :3 June 2023,8:00 pm

Minister RK Roja : మే 30 వ తారీఖు నాటికి వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు కావడంతో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలలో.. నాలుగు తరాలు గుర్తుండి పోయేలా సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రాష్ట్రంలో చేశారని రోజా తెలియజేయడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయటం గర్వకారణంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి..

Minister Roja Comments On TDP Party And Jr NTR

Minister Roja Comments On TDP Party And Jr NTR

నేను ఉన్నాను నేను విన్నాను.. అనే ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు. ఈ రకంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఆ నమ్మకాన్ని మరింత రెట్టింపు అయ్యేలా పరిపాలన అందించారు. వైయస్ జగన్ పరిపాలన గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమిలితి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఈ నాలుగు సంవత్సరాల వైఎస్ జగన్ పరిపాలన చేసి చంద్రబాబుకి నవనాడులు చీట్లిపోతున్నాయి. దీంతో చంద్రబాబు తన హయాంలో చేసిన మంచి ఏది చెప్పుకోవడానికి లేకపోవడంతో..

Minister Roja Comments On TDP Party And Jr NTR

Minister Roja Comments On TDP Party And Jr NTR

ప్రజా ఛార్జ్ షీట్ అంటూ ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ నీ ఓడించడానికి 600కు పైగా హామీలు ఇచ్చి..వాటిని నెరవేర్చలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదట సంతకం చేసిన వాటికే విలువ లేకుండా పోయినాయి అని మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంకా చంద్రబాబు పాలనలో జరిగిన అన్యాయంపై… అవినీతిపై తనదైన శైలిలో కామెంట్స్ చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది