Minister Roja : పవన్ కళ్యాణ్ కుక్కలాగా భౌభౌ అని మొరగకు.. జగన్ ముందు నీబ్రతుకెంత తూ.. రోజా సంచలన కామెంట్స్.. వీడియో
Minister Roja : శ్రీకాకుళంలో “యువశక్తి” మహాసభలో జనసేన నేత పవన్ కళ్యాణ్.. మంత్రి రోజాపై డైమండ్ రాణి అంటూ విమర్శలు చేయడం తెలిసిందే. నువ్వు కూడా..నా..అంటూ… తూ.., నా బతుకు చెడ అంటూ.. వ్యంగ్యంగా పవన్ విమర్శించారు. దీంతో మంత్రి రోజా తనపై పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సందర్భం వచ్చిన ప్రతిసారి ఏకీపారేస్తున్నారు. రాజకీయాలలో వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నిన్ను ప్రజలు రెండు చోట్ల ఓడించారు. నిన్ను విమర్శించాలంటే నా బతుకు కూడా.. చెడ అన్న రీతిలో… రోజా కౌంటర్లు వేశారు. ఇదిలా ఉంటే ఇటీవల వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మరోసారి పవన్ కళ్యాణ్ ని కుక్కతో పోలుస్తూ.. విమర్శలు చేయడం జరిగింది.
“ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిని.. కొంతమంది మీటింగులు పెట్టి భౌభౌ..భీమ్ భుం అనీ అరుస్తున్నారు. వాళ్ల అరుపులు ఊగిపోవడాలు చూస్తుంటే వేమన పద్యం గుర్తొస్తుంది. “అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను..సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ”. ఈ పద్యంలో అల్పుడిని కంచుతోను.. సజ్జనుడుని.. కనకాంబరం అంటే బంగారంతోను వేమన పోల్చడం జరిగింది. ఇక మన రాష్ట్రంలో చూస్తే సజ్జనుడు జగన్మోహన్ అయితే అల్పుడు చాలామంది ఉన్నారు. గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రతి వీకెండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బౌబౌ అని అరవటం…
తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడం. కానీ సజ్జనుడు మన మధ్యలోనే ఉంటూ.. ఇక్కడ ఇల్లు కట్టుకుని ప్రజల సంతోషాలలో పాలుపంచుకుంటున్నాడు. ప్రజా సమస్యల తీరుస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి అయిన నాకు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే రీతిలో సంస్కృతి శాఖ.. బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. మీకు సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రోజుకొక వేమన పద్యం చదవండి. చదివిన ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మనం మారితే మన పిల్లలలో మార్పు వస్తుంది. మనం మారితే సమాజం మారుతుంది అంటూ రోజా తనదైన శైలిలో వేమన జయంతి కార్యక్రమంలో పవన్ పై సెటైర్లు వేశారు.