Minister Roja : ఒరేయ్ ఆడవాళ్ళతో కొట్టిస్తా… బఫూన్ అంటూ లోకేష్ పై రోజా ఫైర్ వీడియో వైరల్..!!

Advertisement

Minister Roja : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నగరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా మంత్రి రోజా నియోజకవర్గం కావడంతో లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. జబర్దస్త్ ఆంటీ .. డైమండ్ పాప అంటూ రోజాపై సెటైర్లు వేయటం జరిగింది. రోజా కుటుంబం నగరి నియోజకవర్గంలో భూకబ్జాలకు అవినీతికి పాల్పడుతున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే లోకేష్ తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. నాపై మరియు నా కుటుంబం పై ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా అని లోకేష్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాజకీయం రాజకీయాలా చేయాలి. సిద్ధాంతాలు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి.

Advertisement

YSRCP RK Roja Satirical Comments On Nara Lokesh At Tirumala Visit: నారా  లోకేష్‌పై మంత్రి రోజా సెటైర్లు! - SumanTV

Advertisement

మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేయారు.. మీరు ఇంకా దిగజారి పోతారు. గతంలో అధికారంలో ఉన్న ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. నా గురించి మాట్లాడితే మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తది. నువ్వు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలా చదివావో… ఎవరు నీకు ఫీజు కట్టారో అన్ని విషయాలు బయట పెట్టాల్సి వస్తది. నియోజకవర్గంలో నాపై ఆరోపణలు చేసిన లోకేష్ కి సవాలు విసురుతున్న బహిరంగ చర్చకు రావాలని కోరుతున్నాం అంటూ రోజా ఛాలెంజ్ విసిరారు. టీడీపీ హయంలో ఏం జరిగింది నేను అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది అన్నదానికి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై పడిపోయిన గాని ఏమాత్రం కనికరం చూపకుండా లోకేష్ తన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

Minister Roja Strong Warning To Nara Lokesh
Minister Roja Strong Warning To Nara Lokesh

ఇటువంటి వ్యక్తి నా అన్నలు గురించి నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని రోజా మండిపడ్డారు. నా కుటుంబ సభ్యుల గురించి చేస్తాను సారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తాను శనివారంగంలో ఇంకా రాజకీయ రంగంలో ఓడిపోయిన ఇంకా అనేక సందర్భాలలో తన వెంట ఉన్నది తన కుటుంబ సభ్యులు అన్నయ్యలు మాత్రమే అని రోజా స్పష్టం చేశారు. దొంగ దారిలో మంత్రి అయ్యి తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి దేశంలో ఎవరూ లేరు అది ఒక లోకేష్ మాత్రమే అన్ని రోజా సెటైర్లు వేశారు. లోకేష్ పొలిటికల్ బఫూన్ అని మండిపడ్డారు. రాజకీయాలకు పనికిరాడు అని రోజా తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.

Advertisement
Advertisement