Ycp MLA : మా ఎమ్మెల్యే అవినీతి రూ.250 కోట్లు.. వైసీపీ నేత సంచలన కామెంట్స్..
Ycp Mla : ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని 2019 ఎన్నికల్లో జగన్ ప్రచారం చేశారు. అయితే, ఆయన మాటలను ప్రజలు పెద్దగా విశ్వసించలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన జైలు జీవితం గడిపిందే అవినీతి, అక్రమాల కేసుల్లో.. కేవలం ఆయన రాజన్న బిడ్డ.. ఒకసారి చాన్స్ ఇచ్చి చూద్దాం.. రాజన్న పాలన మార్క్ చూపిస్తాడా? అని నమ్మకంతో వైసీపీకి ప్రజలు ఓటు వేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్పటికే అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలీక సతమతమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
నవరత్నాల పేరతో ఉన్న డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చుచేస్తున్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి ఏముంది అంటే శూన్యం అని అంటున్నారు ఏపీ ప్రజలు.తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకం అని వైసీపీ నేతలు చెబుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం అవినీతికి పరాకాష్ట జగన్, అతని మాటలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. వారు అన్నట్టు గానే కృష్ణ జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతి చిట్టాను సొంత పార్టీ నేత మాలమహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు, బీసీసెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ విప్పారు. తమ ఎమ్మెల్యే ఏకంగా రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాంబ్ పేల్చారు. కొల్లూరులో 1600 ఎకరాలను బినామీ వ్యక్తులకు లీజుకిచ్చి రూ. 50 కోట్ల మేర లబ్ది పొందారని, కైకలూరులో 80 ఎకరాలు,
Ycp Mla : సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే అవినీతి ఆరోపణలు
పామర్రులో 40 ఎకరాలు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 50 ఎకరాలు, విశాఖలో 50 ఎకరాలు, నడిపురులో 13 ఎకరాలు ఇవన్నీ అవినీతిలో భాగమేనన్నారు.పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు ఎమ్మెల్యే టికెట్‌ను ఎస్సీ లేక బీసీలకు కేటాయించాలని మళ్లీ సిట్టింగుకే ఇస్తే వైసీపీ ఓటమి ఖాయమని అసమ్మతి వర్గం నేతలు చెబుతున్నారు. కాగా, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అంత సంపాదిస్తే మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు ఎంత సంపాదించి ఉండాలని ప్రతిపక్షాలు విమర్శలు మొదలెట్టాయి.
ఒక్క కైకలూరు ఎమ్మెల్యే నే 250 కోట్లు వెనకేస్తే…..పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని వేల కోట్లు వేసుంటారు…..
వైసీపీ నాయకులే బయటపెడతున్నారు వాళ్ళ ఎమ్మెల్యే ల అవినీతి…..???????????????? pic.twitter.com/v9H09al74I
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 7, 2022