MLA Kethireddy : పిన్ కోడ్ కూడా లేదు.. అమరావతిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!!
MLA Kethireddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు ప్రకటించారు. ఈ క్రమంలో పాలనపరంగా జగన్ ఎక్కువగా విశాఖపట్నం పై దృష్టి పెడుతున్నారు. ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దేశంలో అంబానీ ఇంకా చాలామంది బడా పారిశ్రామికవేత్తలతో
పాటు ఇతర దేశాలకు చెందిన టాప్ మోస్ట్ కంపెనీల యాజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నం పారిశ్రామిక సదస్సు జగన్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. అయితే ఈ సదస్సు గురించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇటీవల మాట్లాడడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింతగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో అమరావతిని రాజధానిగా ఉంచాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. అసలు అమరావతిలో ఏదైనా ఉందా..?, ప్రజా ప్రతినిధులు అక్కడికి వెళ్తే టీ తాగడానికి కూడా సరైన సదుపాయాలు లేవు.
మళ్లీ అక్కడి నుండి విజయవాడకు వెళ్లాల్సి ఉంది. అసలు అమరావతికి పిన్ కోడ్ అయినా ఉందా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో నిర్మించిన సచివాలయం విషయంలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. అదే సచివాలయం విశాఖపట్నం వంటి అభివృద్ధి జరిగిన ప్రాంతంలో అదే డబ్బుతో కడితే… ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగవుతాయి. ఉద్యోగస్తులు కూడా పనిచేసుకోవడానికి పిల్లలను చదివించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు కూడా ఆలోచించాలి. మాటలు చెప్పే వాళ్ళు కావాలా..?, చేతలు చెసే వాళ్ళు కావాలా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.