KethiReddy : “గుడ్ మార్నింగ్ ధర్మవరం”లో ఆవేశం చూపించిన లేడీ… కేతిరెడ్డికి తిక్క లేచింది వీడియో వైరల్..!!
KethiReddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరు ఒకరకమైతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీరు మరోరకం. ఈయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసమస్యలు తీరుస్తూ… ఎమ్మెల్యే పదవికి సరైన రీతిలో న్యాయం చేసే వ్యక్తి. ఇదే సమయంలో ప్రజా సమస్యల విషయంలో అలసత్వం వహించే అధికారులకు ఊహించని షాక్కులు ఇస్తుంటారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. దాదాపు 15 సంవత్సరాల నుండి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట…
తన నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుంటూ… నిత్యం ప్రజలలో ఉంటూ… అనేక సమస్యలు తీరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో రకరకాల బాధలు ప్రజలు ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు. అయితే “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంలో జరిగే కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో చాలా హైలెట్ అవుతుంటాయి. ఈ రకంగానే “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి దగ్గరికి.. ఓ లేడి అతిగా వ్యవహరించింది. అన్నదమ్ముల భూమి విషయంలో గొడవ జరిగిందని భూమి అమ్మకం

MLA KethiReddy Hilarious Comedy In Village on video
జరిగిందని తమ సొంత ఆస్తిని లేడీ ఎమ్మెల్యే ముందు తన బాధని చెప్పుకుంది. అయితే అది ప్రైవేటు గొడవ… మీ ఆస్తికి సంబంధించి మీ బంధువుల లో జరిగిన గొడవ దానికి ప్రభుత్వంతో సంబంధం ఏమీ ఉండదు.. అని ఎమ్మెల్యే బదులిచ్చారు. సదరు లేడి మరింతగా గట్టిగా వాదించటంతో ఎమ్మెల్యేకి తిక్క లేచింది వెంటనే వెళ్లి ఇటువంటి గొడవలు కోర్టులో తేల్చుకోవాలి మాకు సంబంధం లేదని మొహం మీద ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పటం జరిగింది. ఆమె పేరు సరోజ కావటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.
