Minister MallaReddy : మంత్రి మల్లారెడ్డి కోడలితో డాన్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister MallaReddy : మంత్రి మల్లారెడ్డి కోడలితో డాన్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత వీడియో వైరల్..!!

Minister MallaReddy : మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో మహిళా దినోత్సవంతో పాటు హోలీ పండుగలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి కోడలితో హోలీ సంబరాలలో డాన్స్ చేశారు. ఇదే సమయంలో సమాజంలో మహిళలు రాణిస్తున్న విధానాన్ని కవిత తెలియజేశారు. అన్ని రంగాలలో ఆడవాళ్లు రాణిస్తున్నారని కొనియాడారు. తాను కూడా ఇంజనీరింగ్ చదివినట్లు కంప్యూటర్ విభాగంలో… కోర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మరింతగా రాణించాలని.. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 March 2023,2:00 pm

Minister MallaReddy : మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో మహిళా దినోత్సవంతో పాటు హోలీ పండుగలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి కోడలితో హోలీ సంబరాలలో డాన్స్ చేశారు. ఇదే సమయంలో సమాజంలో మహిళలు రాణిస్తున్న విధానాన్ని కవిత తెలియజేశారు. అన్ని రంగాలలో ఆడవాళ్లు రాణిస్తున్నారని కొనియాడారు. తాను కూడా ఇంజనీరింగ్ చదివినట్లు కంప్యూటర్ విభాగంలో… కోర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

MLC Kavitha And Malla Reddy Daughter In Law Dance At Holi Celebrations

MLC Kavitha And Malla Reddy Daughter In Law Dance At Holi Celebrations

ఇక ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మరింతగా రాణించాలని.. ఉద్యోగాలు చేయాలన్నే ఉద్దేశం మాత్రమే కాకుండా కంపెనీలు పెట్టి ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి పూర్తిగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఐడియా ఉంటే పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని.. వారితో కలిపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

మల్లారెడ్డి కోడలు తో కవిత???? MLC Kavitha And Malla Reddy Daughter In Law  Dance At Holi Celebrations - YouTube

చాలామంది పెట్టుబడిదారులకు ఐడియాలు లేక ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంజనీర్స్ మంచి ఐడియాలతో వస్తే చాలామంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అవకాశాలు చాలా ఉన్నాయి అందరూ… అందిపుచ్చుకోవాలని ప్రసంగించారు. ఇదే సమయంలో మల్లారెడ్డి అన్న స్పీచ్ లు పేటెంట్ చేసుకోవాలని సూచించారు. ఈమధ్య అన్న స్పీచ్ లు చాలా హైలైట్ అవుతున్నాయని సినిమాలో కూడా వచ్చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో ప్రసంగించారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది