Rainy Season : వర్షాకాలంలో జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Rainy Season : వర్షాకాలం వచ్చిందంటే… చల్లని వాతావరణం, ఆహ్లాదకరమై న వాతావరణం, విచిత్ర వాతావరణం మనకు కనిపిస్తుంటుంది.అయితే ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం. ముఖ్యంగా కూరగాయల ఎంపిక, శుభ్రత, వండే విధానం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి.
Rainy Season : శుభ్రతే ప్రధానం…
పాలకూర, మునగాకు, క్యాబేజీ వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే కానీ వర్షాకాలంలో ఇవి తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వ ఇవి మామూలు నీటితో కడిగినా పూర్తిగా తొలగిపోవు. పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది.. కాలీ ఫ్లవర్ & బ్రోకలీ.. వీటికి రంధ్రాలు ఉండటంతో వాటిలో తేమ నిలిచిపోతుంది. తేమ ఉండే చోట బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడం సాధారణం. అందుకే వీటిని ఉప్పు కలిపిన వేడి నీటిలో నానబెట్టి బాగా ఉడికించిన తర్వాత మాత్రమే వాడాలి.

Rainy Season : వర్షాకాలంలో జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
వర్షాకాలంలో టమాటా, దోసకాయ, ముల్లంగి వంటి తేమ ఎక్కువగా కలిగిన కూరగాయలను పచ్చిగా తినడం మంచిది కాదు. ఈ కాలంలో సలాడ్ల రూపంలో తినడం వల్ల అజీర్ణం, విరేచనాల సమస్యలు ఎదురవచ్చు. కాబట్టి, ఇవి కొద్దిగా మరిగించి లేదా ఆవిరితో ఉడికించి తినడం ఉత్తమం. సొరకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయలు తేలికగా జీర్ణమవుతాయి. వీటిలో తేమ తక్కువగా ఉండటంతో క్రిముల ముప్పు కూడా తక్కువ. శుభ్రంగా ఉంచడం కూడా సులభం. త్వరగా వండిపోతాయి కాబట్టి శరీరానికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది.