Moringa Leaves: మునగ ఆకు మాత్రమే కాదు.. దాని వళ్లంతా ఆయుర్వేద గుణాలే..!
మునగ.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మునగ కాయ. దీన్ని ఇష్టపడని వాళ్లు ఎవ్వరూ ఉండరు. పప్పు చారులో, ఇతర కూరల్లో మునగ కాయను వేసుకొని తింటాం. మునగ కాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క మునగ కాయ మాత్రమే కాదు.. మునగ ఆకు, మునగ కాడ.. ఇలా మునగ చెట్టు మొత్తం ఔషధాల గని. అందుకే.. ఆయుర్వేదంలో మునగ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది మునగ అంటేనే లైంగిక సమస్యలకు బెస్ట్ ఔషధం అని చెబుతుంటారు. ఒక్క ఆ సమస్యలు మాత్రమే కాదు.. మునగ ఆకు, కాయలు, కాడలను తీసుకోవడం వల్ల.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మునగాకులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీతో పాటు.. కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. నిజానికి మునగాకు తినడానికి కొంచెం వెగటుగా అనిపించినప్పటికీ.. దాన్ని రకరకాలుగా చేసుకొని తినొచ్చు. మునగాకును పొడిగా చేసుకొని తినొచ్చు. లేదా జ్యూస్ గా చేసుకొని కూడా తాగొచ్చు. మునగాకు పొడితో టీ కూడా చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లేదా కాసిన్ని మునగాకులను తీసుకొని వాటిని పప్పులో కానీ.. ఇతర కూరల్లో కానీ వేసుకొని తినొచ్చు.
Moringa Leaves : అన్ని రకాల వ్యాధులకు ఒకటే మందు
కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు మునగాకు దివ్యౌషధం. రక్తహీనత ఉన్నా, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు మునగాకును క్రమం తప్పకుండా తీసుకుంటే ఆయా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. చిన్నపిల్లలకు కూడా మునగాకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లలు, గర్భిణీలకు, బాలింతలకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
బరువు తగ్గాలని అనుకున్నా.. చర్మ సమస్యలు తగ్గాలన్నా.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ ను తగ్గించాలన్నా.. శరీరంలో ఉన్న విష పదార్థాలను నాశనం చేయాలన్నా.. డయాబెటిస్ ను అదుపులో ఉంచాలన్నా.. హైబీపీని కంట్రోల్ చేయాలన్నా.. ఇలా మనకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు ఒకటే మందు మునగ. అందుకే.. జీవితంలో మునగను ఒక భాగం చేసుకోవాల్సిందే. మునగ ఆకు దొరికితే ఆకును జ్యూస్ చేసుకొని కానీ.. లేదంటూ పొడి చేసుకొని కానీ నిత్యం వాడుతూ ఉండండి. అలాగే.. మునగ కాయలను కూరల్లో వేసుకొని వండుకొని నిత్యం తీసుకుంటే.. ఎన్నో వ్యాధులను రాకుండా అరికట్టవచ్చు.