YS Jagan : జగన్ ఒక ఆధునిక సంఘ సంస్కర్త.. ఈ మాట అన్నది ఎవరో కాదు..!
YS Jagan : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాల ఓటు బ్యాంకును సాధించాలి. రెండోసారి ఏపీ ప్రజలు చాన్స్ ఇవ్వాలంటే అన్ని సామాజిక వర్గాలను దగ్గరికి తీసుకోవాలి. వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై అందుకే వైసీపీ పార్టీ దృష్టి సారించింది. వెనుకబడిన సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడం కోసం బీసీలకు అధికారాన్ని కల్పిస్తామని దానికి తగ్గ ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అందుకే బీసీలను అన్నింట్లో భాగస్వాములను చేస్తోంది. బీసీ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడం కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.
ఇటీవల విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ మహాసభను ఉద్దేశిస్తూ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు ఆయన హాజరు అయిన విషయం తెలిసిందే. ఏపీలోని బీసీ సర్పంచులు, జెడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ హాజరయ్యారు. ఈ మహా సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 85 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సభలో ప్రసగించిన ఆర్ కృష్ణయ్య.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీసీలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. బీసీలకు ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గంలోనే 11 మందికి అవకాశం ఇచ్చారని కొనియాడారు. వెనుకబడిన సామాజిక వర్గం అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని..
YS Jagan : వైఎస్ జగన్ బీసీలకు చాలా ప్రాధాన్యతనిచ్చారన్న కృష్ణయ్య
అటువంటి నాయకుల్లో జగన్ ఏకైక నాయకుడని అభివర్ణించారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. నేను గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాను. బీసీల కోసం, వాళ్ల అభ్యున్నతి కోసం చాలా కష్టపడ్డాను. బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కేంద్ర మంత్రులను కూడా కలిశా. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.. సీఎం జగన్ మాత్రం బీసీలకు న్యాయం చేశారన్నారు. అందుకే.. వైఎస్ జగన్ ను కృష్ణయ్య.. సంఘ సంస్కర్త అంటూ కొనియాడారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతకు అందరూ మద్దతు ఇవ్వాలని కృష్ణయ్య కోరారు.