Nagababu : నాకు పెంపుడు కుక్కలంటేనే ఇష్టం.. బాబు గోగినేని కాదు… పవన్ పై సెటైర్ వేశాడని నాగబాబు షాకింగ్ కామెంట్?
Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా కూడా ప్రకటించింది. అలాగే… హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను పార్టీ విడుదల చేసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే… ఆ ఫోటోను చూసి పవన్ అభిమాని ఒకరు… ఓ స్కెచ్ వేశారు. పవన్ బెడ్ మీద పడుకొని ఉండగా… పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానంద, చెగువేరా పరామర్శించడానికి వెళ్లినట్టుగా ఆ ఫోటో ఉంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోను పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా షేర్ చేశారు.

nagababu about babu gogineni response on pawan kalyan photo
అయితే… ఆ ఫోటోపై బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని స్పందించారు. ఆ ఫోటోపై ఆయన కాస్త వెరైటీగా స్పందించారు. సెటైరికల్ గా తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఎంతైనా 39 ఏళ్లకే చనిపోయిన వివేకానందుల వారు… అదే వయసులో చంపబడ్డ డాక్టర్ చే గారు.. ఇద్దరూ రిస్క్ తీసుకొని మాస్క్ పెట్టుకోకుండా అభిమానుల కోసం చక్కగా తల దువ్వుకొని నలగని లుంగీలో డ్రెస్ అయ్యి సలైన్ ఎక్కించుకుంటున్న 49 ఏళ్ల యువ హీరోను పరామర్శించడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఫోటో కూడా ఈ కార్టూన్ లాగే ఉంటుంది. తొందరలో కోలుకొని మీ కన్నా ఆయన తక్కువ పుస్తకాలు చదువుకున్నా కూడా బ్రహ్మచారి మరియు రాజయోగి అయిన వివేకానందుల స్వామి వారి స్థానాన్ని మీరు భర్తీ చేస్తారు అని అభిమానులం అందరం ఆశిస్తున్నాం. అలాగే చే గారి టీ షర్ట్ ఇంకా మీ దగ్గరే ఉంటే… ఆయనది ఆయనకు ఇచ్చేస్తే పోతుందేమో.. ఇంకెవరికైనా ఇచ్చుకుంటాడు. బయట.. మీ అదర్సాల నుంచి స్ఫూర్తి పొందుతున్న మిత్రులు గాడ్సే గారూ… గాంధీ గారూ… వారిద్దరి అనుబంధంపై సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతున్న ఆర్జీవీ గారూ.. మిమ్మల్ని కలుసుకోవాలని వెయిటింగ్. మండేలా గారు వచ్చి వెళ్లారటగా. ఏసు సంగతే అర్థం కావడం లేదు. వస్తాను అని ఎప్పుడో అన్నాడు కానీ. ఆయన్ని నమ్మలేము.. అంటూ బాబు సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

nagababu about babu gogineni response on pawan kalyan photo
Nagababu : బాబు గోగినేని పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్
బాబు గోగినేని పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అయ్యారు. బాబు గోగినేనికి కౌంటర్ వేశారు. అలాగే… ఆయన పోస్ట్ ను మెగా బ్రదర్ నాగబాబుకు షేర్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు… నాకు ఇలాంటివి పార్వర్డ్ చేయకండయ్యా… నాకు పెంపుడు కుక్కలంటేనే ఇష్టం… బాబు గోగినేని కాదు అంటూ… బాబు గోగినేనిని ఊరకుక్కలతో పోల్చాడు నాగబాబు.
https://www.facebook.com/SkillguruBabu/posts/4090472324348860
నాకు ఇలాంటివి Forward చేయకండయ్యా….
I am only Interested in my pet Dogs…@GogineniBabu pic.twitter.com/90ROOhQB6I
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 17, 2021