Nagam Janardhan Reddy : జీవితంలో చివరాఖరి చాన్స్..!
Nagam Janardhan Reddy : తెలంగాణ రాజకీయాల్లో నాగం జనార్థన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీలో ఆయన చాలా పదవులను చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్థన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. కానీ.. ఇదంతా కొన్ని రోజులు మాత్రమే నడిచింది. నాగం హవా ఆ తర్వాత తగ్గిందనే చెప్పుకోవాలి. 2018 ఎన్నికల్లో నాగంను ప్రజలు గెలిపించలేదు. ఆయన పలు పార్టీలు మారినప్పటికీ.. సొంత పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు మాత్రం అనుకున్నంత పేరు మాత్రం రాలేదు.
నిజానికి.. 1994 నుంచి 2012 వరకు ఆయన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత టీడీపీ నుంచి బయటికి వచ్చేశారు. సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు కానీ.. ఆయనకు బీజేపీలో అంతగా కలిసిరాలేదు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ.. గెలవలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు నాగం కాస్త దూరంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
Nagam Janardhan Reddy : టీడీపీ హయాంలో పలు మంత్రిత్వ శాఖలను చేపట్టిన నాగం
టీడీపీ హయాంలో నాగం జనార్థన్ రెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగానూ పని చేశారు. ఆయనకు రాజకీయాల్లో వివాద రహితుడు అనే పేరు కూడా ఉంది. ఆయనకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో నాగంకు ఏదైనా అవకాశం ఇస్తే ఇవ్వొచ్చు. రేవంత్ తర్వాత అంతటి ప్రాధాన్యతను ప్రస్తుతం నాగంకు ఇస్తున్నప్పటికీ.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరి.. ఈ సారి నాగర్ కర్నూలు నుంచి ఈయన బరిలోకి దిగుతారా? లేక.. తన కొడుకు నాగం శశిధర్ రెడ్డిని బరిలోకి దింపుతారా? అనేది తేలాల్సి ఉంది.