nara lokesh : లోకేష్ బాబు కూడా వైఎస్ జగన్ లాగే.. కానీ..!
nara lokesh : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ nara lokesh కూడా తన పార్టీని ముందుండి నడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఏవిధంగానైతే అధికార పక్షం నాయకుల చేత నానా మాటలు పడ్డాడో ఇప్పుడు లోకేష్ బాబు కూడా వైఎస్సార్సీపీ లీడర్లతో పచ్చి తిట్లు తింటున్నాడు. రూలింగ్ పార్టీ సోషల్ మీడియా విభాగం విసిరే పొలిటికల్ పంచ్ లకు, కౌంటర్లకు నిత్యం గురవుతున్నాడు. అయితే దీనికి కేవలం అవతలి పక్షం వాళ్లను మాత్రమే తప్పుపట్టాలా లేక లోకేష్ బాబు వైపు కూడా వేలెత్తి చూపొచ్చా అంటే రెండోదానికి సైతం చాలా మంది ఓకే అంటున్నారు.
nara lokesh కారణం?..
లోకేష్ బాబు తనను తాను ఎక్కువ ఊహించుకోవటం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు లోకేష్ బాబును చంద్రబాబు కొడుకు మాదిరిగా కాకుండా ఆయన స్థాయి నాయకుడిగా అంచనా వేసుకుంటూ ఉండటం. రాజకీయాల్లో ఎవరి రేంజ్ ఏంటనేది ప్రజలు నిర్ణయించాలి. అసలు ఏ ఎన్నికల్లోనూ గెలవని తన పుత్రరత్నాన్ని చంద్రబాబు టీడీపీకి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమించుకుంటాడు. అలా మనకు మనం నేషనల్ లెవల్ లీడర్లుగా అంచనా వేసుకుంటే నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది. దీనివల్ల ఫలితం శూన్యం. కాబట్టి లోకేష్ బాబు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని విమర్శించే ముందు తమ స్థాయేంటో మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఫ్యాక్షనిస్టు.. : Nara Lokesh
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీవాళ్లు మొదటి నుంచీ ఫ్యాక్షనిస్టుగా, అవినీతిపరుడిగా, ఆర్థిక నేరస్తుడిగా బలమైన ముద్ర వేశారు. అఫ్ కోర్స్ వాటిని జనం నమ్మలేదనుకోండి. అది వేరే విషయం. నమ్మి ఉంటే మొదటిసారి పార్టీ పెట్టి శాసన సభ ఎన్నికల్లో నిలబడితే 60కిపైగా సీట్లు గెలిపిస్తారా?. రెండో ప్రయత్నంలోనే అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకొస్తారు?. కాబట్టి లోకేష్ బాబు అండ్ టీమ్ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
పప్పు.. వేస్టు.. nara lokesh
వైఎస్ జగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పచ్చి విమర్శలను వైఎస్సార్సీపీ కూడా బలంగానే తిప్పికొడుతోంది. లోకేష్ బాబును పప్పు నాయుడు అంటూ ఆ పార్టీ నాయకులు ఒక ఆట ఆడకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి కొడాలి నానీ అయితే లోకేష్ బాబును పట్టుకొని నోటికొచ్చి తిడుతుంటాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకటికి పది సార్లు అర్థంపర్థంలేని విమర్శలు చేయటం వేస్ట్ అని పొలిటికల్ పెద్దలు సూచిస్తున్నారు.