ChandraBabu : నారాయణకి బెయిల్.! అయినా చంద్రబాబుకి తగ్గని భయం.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ChandraBabu : నారాయణకి బెయిల్.! అయినా చంద్రబాబుకి తగ్గని భయం.!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2022,11:00 am

ChandraBabu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఎన్నడూ లేనంత విధంగా హైరానా పడ్డారు మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ కావడంతో. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ పోలీసులు నిన్న హైద్రాబాద్‌లో అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి, చంద్రబాబు మొత్తం పరిస్థితిని ప్రత్యేకంగా ‘మానిటర్’ చేశారట. నారాయణ బెయిల్ మీద విడుదలయ్యేవరకు ఓ ప్రత్యేక న్యాయవాదుల బృందం చంద్రబాబు పర్యవేక్షణలో పని చేసిందని టీడీపీ అనుకూల మీడియానే చెబుతోంది.

‘దోషి అయితే శిక్షింపబడతాడు.. దోషి కాకపోతే, భయపడాల్సిన పనిలేదు.. మా ప్రభుత్వం ఎవరి మీదా కుట్ర పూరితంగా కేసులు నమోదు చేయదు. ఒకవేళ న్యాయస్థానంలో మాజీ మంత్రి నారాయణ ఊరట పొందినా.. కేసు విచారణ అయితే కొనసాగుతుంది..’ అంటూ పరిస్థితిని ముందుగానే ఊహించిన వైసీపీ, తాను చెప్పదలచుకున్నది చెప్పేసింది. అయినా, మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించి, విద్యా సంస్థల అధిపతిగా ఎదిగిన నారాయణ, మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు చేయించడమేంటి.. అని జనం ఛీత్కరించుకుంటున్నారు.

Narayana Gets Bail Still ChandraBabu In Fear

Narayana Gets Bail, Still ChandraBabu In Fear

ఇది వాస్తవానికి కొత్త విషయం కాదు, నారాయణతోపాటు శ్రీ చైతన్య అనే విద్యా సంస్థ కూడా చాలా ఏళ్ళుగా ఈ పేపర్ లీకేజీ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి కేటుగాళ్ళ భరతం పట్టాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, నారాయణకు బెయిల్ వచ్చినాగానీ, చంద్రబాబులో భయం తగ్గకపోవడానికి కారణం, అమరావతి కేసులో నారాయణ ఏ2 నిందితుడిగా చేర్చబడితే, చంద్రబాబు ఏ1 నిందితుడవడం. ఆ కేసులోనూ నారాయణ అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ న్యాయవాదుల్ని చంద్రబాబు అప్రమత్తం చేశారట.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది