PM Modi : కరోనా విషయంలో ప్రధాని మోదీ డేరింగ్ స్టెప్.. హేట్సాఫ్ మోదీజీ?
PM Modi : ప్రస్తుతం దేశమంతా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య… కరోనా. అవును… ఈ కరోనా వల్ల దేశమంతా అతలాకుతలం అవుతోంది. గత సంవత్సరం కూడా ఇలాగే కరోనా మనల్ని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసింది. తాజాగా అదే కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ రూపంలో మన మీదికి మళ్లీ దూసుకొచ్చింది. ఇప్పుడు దీన్నే మనం కరోనా సెకండ్ వేవ్ అంటున్నాం. రోజు రోజుకూ కరోనా హద్దులు మీరుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజూ వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా… కరోనా మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నది.

narendra modi decision on oxygen cylinders for corona patients
దీంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. నార్త్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఢిల్లీలో ఓ వారం పాటు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. మరికొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట, వారాంతాల్లో లాక్ డౌన్ విధించారు. ఏం చేసినా.. కరోనా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాం. కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రలన్నీ ఫుల్… ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్లు ఖాళీ లేవు. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటో అరో బెడ్ ఖాళీగా ఉన్నా… లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు కరోనా ట్రీట్ మెంట్ అంత ఖర్చు పెట్టి చేయించుకోలేకపోతున్నారు.
ఓవైపు బెడ్ల కొరత వేధిస్తుంటే మరోవైపు వెంటిలేటర్లు, ఆక్సీజన్ల కొరత కూడా అంతటా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఎక్కడ కూడా సరిపడా ఆక్సీజన్లు లేవు. దీంతో ఆక్సీజన్ల కొరత తీవ్రంగా ఉండటంతో కొందరు కరోనా పేషెంట్లు ఆక్సీజన్ అందక… మృత్యువాత పడుతున్నారు. కరోనా వచ్చి కేవలం ఆక్సీజన్ అందక.. శ్వాసకు సంబంధించిన సమస్యలతో చాలామంది చనిపోతుండటంతో… ఎలాగైనా దేశం అంతటా.. సరిపడా ఆక్సీజన్లను సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారు.
PM Modi : అన్ని రాష్ట్రాలకు ఆక్సీజన్ సిలిండర్లు పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అన్ని రాష్ట్రాలకు ఆక్సీజన్ సిలిండర్లను పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాన్ని ఎంచుకుంది. దేశంలో ఉన్న ఆక్సీజన్ సరఫరా చేసే పరిశ్రమలకు అన్నింటికీ ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం… ఆక్సీజన్ ఉత్పత్తిని ఆపకుండా… ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాలని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆక్సీజన్ ఉత్పత్తి కాగానే… రైళ్ల ద్వారా.. దేశం అంతటా ఆక్సీజన్లను ఆయా రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. మొత్తం ఆక్సీజన్ ట్యాంకర్లను రైళ్ల ద్వారా ప్రతి రాష్ట్రానికి పంపించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే.. రోడ్డు మార్గం ద్వారా ఆక్సీజన్ సిలిండర్లతో వెళ్లే వాహనాలను అన్ని రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఇలా… ఏ రవాణా ద్వారా కుదిరితే… ఆ రవాణా ద్వారా వెనువెంటనే ఆక్సీజన్ సిలిండర్లను అన్ని రాష్ట్రాలకు పంపించి… ఆక్సీజన్ కొరత లేకుండా చేసి కరోనా మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించాలనేది మోదీ నిర్ణయంగా తెలుస్తోంది. ఏది ఏమైనా… మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.