Narendra Modi : నరేంద్ర మోదీ అంటే రాహుల్ గాంధీకి వణుకు అని నిరూపించిన సంఘటన..!
Narendra Modi : ఓవైపు గుజరాత్ లో ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అది కూడా అతి త్వరలోనే. మరో మూడు నెలలు అంతే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కదా. బీజేపీ అంటే ఎలాగూ గుజరాత్ ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇటీవలే భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ స్టార్ట్ చేశారు కదా. ఈ యాత్ర దాదాపు 150 రోజుల పాటు సాగనుంది. కానీ.. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించడం లేదు. ఓవైపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యాత్ర ఎందుకు లేదు.
గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తారట. అప్పుడు జోడో యాత్ర గుజరాత్ లో కొనసాగనుంది. అయితే.. కేవలం ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ కు రాహుల్ గాంధీ ఒకటి రెండు రోజులు గుజరాత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్నికల ముందు గుజరాత్ లో జోడో యాత్రను ఎందుకు చేయడం లేదు అనే వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈసారి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చాటబోతోంది. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
Narendra Modi : గుజరాత్ ను కాంగ్రెస్ వదిలేసిందా?
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ల జాడే లేదు. ఎందుకు కాంగ్రెస్.. గుజరాత్ ను వదిలేసినట్టు అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. రాహుల్ గాంధీ చేసే యాత్రే ప్రజలతో మమేకం కావాలని. అటువంటి యాత్రలు అవసరమే కానీ.. సరిగ్గా ఎన్నికల టైమ్ కు ఎందుకు రాహుల్ గాంధీ గుజరాత్ ను ఎందుకు వదిలేసినట్టు. అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఎందుకు లైట్ తీసుకున్నారు అనేది అంతుపట్టడం లేదు. అయితే.. ఇప్పటికే రాహుల్ గాంధీ గుజరాత్ లో మూడు సార్లు పర్యటించారు. కానీ.. అవి ఎన్నికల ప్రచారంలో భాగం కాదు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే ఆ పార్టీ ఓట్లు ఆమ్ ఆద్మీకి పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య ఉండే అవకాశం ఉంది.