Vakeel saab : వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై నెటిజన్ల ఆగ్రహం?
Vakeel Saab : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ గురించే చర్చ. పవర్ స్టార్ అంటే మామూలు విషయం కాదుగా. రచ్చ రచ్చే ఉంటది మరి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండి తెర మీద కనిపిస్తుండటంతో పవర్ స్టార్ సినిమా వకీల్ సాబ్ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ అభిమానులైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమా పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ ను తీశారు. పింక్ రిమేక్ కావడం, మరోవైపు పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ గా కనిపించడంతో… ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.
ఈసినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని… సినిమా టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచేశారని తెలుస్తోంది. చాలా థియేటర్లతో ఎక్కువ రేటుకు టికెట్లను అమ్ముతారని ప్రచారం జరుగుతుండటంతో… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు… నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. రెగ్యులర్ షోల టికెట్ల ధరలకు అదనంగా 100 రూపాయలను పెంచారట. టికెట్ల ధరల పెంపుపై నిర్మాత దిల్ రాజు సమాధానం చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Vakeel Saab : బెనిఫిట్ షోకే 1500 రూపాయల వరకు టికెట్ ధర?
సాధారణంగా బెనిఫిట్ షోలకు టికెట్ ధర ఎక్కువుంటుంది. కానీ.. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోకే 1500 రూపాయల దాకా తీసుకుంటున్నారట. నిజానికి పవర్ స్టార్ సినిమా కాబట్టి… టికెట్ల ధరలు పెంచినా పెద్దగా పట్టించుకోరు కానీ… వకీల్ సాబ్ కు పెంచిన టికెట్ల ధరలు జెన్యూన్ గా లేవని… తమ ఇష్టం ఉన్నట్టుగా టికెట్ల ధరలను పెంచుతున్నారని నెటిజన్లు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ మరో సినిమా హరిహర వీరమల్లుకు ఎంత ధరలు పెంచినా ఒప్పుకుంటాం కానీ… వకీల్ సాబ్ కు టికెట్ల ధరలు పెంచితే ఒప్పుకునేది లేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో కాస్త గుర్రుగానే ఉన్నారు. చూద్దాం మరి… దీనిపై దిల్ రాజు కానీ.. మూవీ యూనిట్ కానీ ఎలా స్పందిస్తుందో?