New Electric Bike : రూ.999కే స్టైలిష్ బైక్..ఒక్క ఛార్జ్‌తో 180 కిలోమీటర్ల ప్రయాణం.. ఈఎంఐ ఎంత కట్టాలి అంటే..!
New Electric Bike : ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ అనేది కామన్‌గా మారింది. కాకపోతే ఒక్కొక్కరు వారి తాహతకు తగ్గట్టు డిఫరెంట్ మోడల్స్ బైకులు కొంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో కొత్తగా ఎలక్రిక్ బైక్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటికి పెట్రోల్‌తో పని లేదు. ఇంటి దగ్గరే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. టోర్క్ క్రాటోస్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను బుధవారం భారతదేశంలో ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్ లుక్‌తో వస్తున్న ఈ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో కేవలం రూ.1.02 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు (ఢిల్లీ సబ్సిడీతో సహా) కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ఫీచర్స్ కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి.
ఐడీసీ నుంచి 180 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధి కలిగి ఉంది. ఈ బైక్ క్రాటోస్, క్రాటోస్ ఆర్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. కంపెనీ ఈ బైక్‌లో ఐపీ 67 రేటెడ్ 4కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చింది. దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 0-40 స్పీడ్‌ను కేవలం 4 సెకన్లలోనే అందుకుంటుందని కంపెనీ తెలియజేస్తోంది. ఇంకా ఈ బైక్‌లో జియోఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్, మోటోవాల్క్ అసిస్ట్, క్రాష్ అలర్ట్, వెకేషన్ మోడ్, ట్రాక్ మోడ్, స్మార్ట్ చార్జ్ అనాలసిస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ రంగుల్లో లభ్యం అవుతోంది. 4 నుంచి 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది.
New Electric Bike : సరికొత్త స్టైల్‌లో..
ఈ బైక్‌లను కేవలం రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ బుకింగ్స్ దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. దేశంలోని ఏ మారుమూల ప్రాంతం వారైనా దీనిని బుక్ చేసుకోవచ్చునని, ప్రకటించిన సమయానికి డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది.దీనికి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది . రూ.20 వేల డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. మీరు లోన్ కింద ఇంకా రూ.82 వేల వరకు రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి 9.7 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకున్నారు. ఇప్పుడు 3 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మీకు ప్రతి నెలా దాదాపు రూ.3 వేల ఈఎంఐ పడుతుంది. అదే రెండేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. నెలకు రూ.4,100 వరకు చెల్లించాల్సి ఉంటుంది.