YS Jagan Cabinet : త్వరలో క్యాబినెట్ మార్పు.. ఎవరూ ఊహించని నేతకు మంత్రి పదవి ఇవ్వనున్న వైఎస్ జగన్..?
YS Jagan Cabinet : ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక క్యాబినేట్ ను విస్తరించారు సీఎం జగన్. అయితే.. ఆ సమయంలో కొందరు ముఖ్య నేతలకు మంత్రి పదవి దక్కలేదన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఎవరికైతే మంత్రి పదవి దక్కుతుంది అని అనుకున్నామో… వాళ్లకు మంత్రి పదవి దక్కలేదు. అనుకోని నేతలకు మంత్రి పదవి దక్కింది. తమకు మంత్రి పదవి దక్కలేదని కొందరు నేతలు చిన్నబుచ్చుకున్నారు కూడా. దీంతో మరో రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని… ఇప్పుడు చోటు దక్కని వాళ్లకు అప్పుడు చోటు కల్పిస్తామని సీఎం జగన్… నేతలకు మాటిచ్చారు. దీంతో అందరు నేతలు సైలెంట్ అయిపోయారు. కొందరు నేతలకు వేరే పదవి ఇచ్చి వాళ్లను సంతృప్తి పరచారు జగన్.
అయితే.. తమకు ఎప్పుడు మంత్రి పదవి వస్తుందా? ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణను సీఎం జగన్ చేపడతారా? అని చాలామంది నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. అటువంటి నేతలకు సీఎం జగన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారట. ఇంకో మూడునాలుగు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో కొంచెం అటూ ఇటూ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు మంత్రులను తీసేసి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
YS Jagan Cabinet : గుడివాడ అమర్నాథ్ కానీ కరణం ధర్మశ్రీకి కానీ దక్కనున్న మంత్రి పదవి?
అందుకే… ఎవ్వరూ ఊహించని ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి స్థానంలో అదే విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారట. ఆయనతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కరణం ధర్మశ్రీకి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అలాగే వివాద రహితుడు. కరణానికి వైఎస్ కుటుంబంపై ఉన్న అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. జగన్ కు కూడా కరణం అంటే మంచి అభిప్రాయం ఉండటంతో కరణంకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
అటు గుడివాడ అమర్నాథ్ కానీ.. ఇటు కరణం ధర్మశ్రీ కానీ… ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈసారి మంత్రి వర్గ మార్పులో చోటు దక్కుతుందని… వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే… ఈ వార్తలో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియాలంటే మాత్రం వైఎస్ జగన్ క్యాబినేట్ విస్తరణ జరిగేంతవరకు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=Kag5OzYGNUQ