nimmagadda ramesh kumar issue reopening soon
Nimmagadda : నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మళ్లీ తెర మీదికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ)గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ.. రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుతో కయ్యానికి కాలు దువ్వాడు. ప్రతిపక్షాలు పొగడటంతో రోజురోజుకీ రెచ్చిపోయేవాడు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాలు కేస్తే మెడకి, మెడ కేస్తే కాలుకి అన్నట్లు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నాడు. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైకి అనుకున్నట్లు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించగలిగాడు గానీ మనసులో అనుకున్నది మాత్రం నెరవేరలేదు. వైఎస్సార్సీపీని ఓడించాలని నిమ్మగడ్డ కంకణం కట్టుకున్నా పదవీ కాలం ముగియటంతో అర్ధంతరంగా ఆట నుంచి తొలిగిపోయాడు. కానీ ఎస్ఈసీగా ఉన్నప్పుడు తమతో ఆడుకున్న నిమ్మగడ్డను ఇప్పట్లో వదల బొమ్మాళీ అని అధికార పార్టీ తేల్చిచెబుతోంది.
nimmagadda ramesh kumar issue reopening soon
రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ శాసన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఫిర్యాదు ప్రివిలేజ్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉండిపోయింది. కరోనా సెకండ్ వేవ్ కి ముందు నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉండటం, అప్పటికే కొవిడ్ వ్యాప్తి ప్రారంభం కావటంతో ఈ కంప్లైంట్ పై విచారణలో అనుకోని జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆ మహమ్మారి కాస్త అదుపులోకి రావటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తమ ముందుకు పిలిపించి వివరణ కోరాలని ప్రివిలేజ్ కమిటీ అనుకుంటోంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు ప్రివిలేజ్ కమిటీలో నిమ్మగడ్డపై పెండింగ్ లో ఉన్న ఫిర్యాదు విచారణ పురోగతిని స్వయంగా తెలుసుకున్నట్లు, ఫాలో అప్ చేస్తున్నట్లు సమాచారం.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేశారా లేదా అనేది ప్రివిలేజ్ కమిటీ విచారణలో తేలుతుంది. దీంతో అతనికి ఏ శిక్ష విధిస్తారనేది కూడా ముఖ్యం కాదు. కేవలం నిమ్మగడ్డను తమ ముందుకు పిలిపించుకొని వివరణ కోరాలనేదే రూలింగ్ పార్టీ వాళ్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొదటి నుంచీ ఇరు వర్గాల మధ్య తలెత్తిన అసలు సమస్య ఈ ఇగో ఫీలింగే. నిమ్మగడ్డను బోనులో నిలబెడితే చాలు.. తమ అహం చల్లారుతుంది అని ఫిర్యాదుదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇష్యూని మరీ తెగే దాక లాగాలని ఎవరూ అనుకోవట్లేదు. తద్వారా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయిన నిమ్మగడ్డను మళ్లీ కెలికి ఏదో సాధిద్దాం అని కూడా కోరుకోవట్లేదు. జస్ట్.. ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కోసమే ఈ పాకులాట.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.