Home » News » No Da Hike For Central Govt Employees As Per 7th Pay Commission
News

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల డీఏ పెంపు లేనట్టేనా? డీఏ ఎప్పుడు పెరగనుంది?

Authored By
Varun G
The Telugu News | Published on: August 27, 2022, 6:00 pm
Advertisement

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని తెగ ఎదురు చూస్తున్నారు డీఏ పెంపు గురించి. ఈ నెలలోనే డీఏ పెంపు గురించి శుభవార్త వింటామని అంతా అనుకుంటున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన శుభవార్త వింటామని ఆశతో ఉండగా ఇప్పటి వరకు డీఏ పెంపు గురించి కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంకో మూడు రోజుల్లో ఆగస్టు నెల పూర్తి కానుంది. ఈనేపథ్యంలో ఈ నెల డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. జులై 1, 2022 నుంచి డీఏ పెంపుపై ప్రకటన చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెరిగింది అని వచ్చే వార్తలన్నీ ఫేక్ అంటూ కేంద్రం ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాట్సప్ లో ఫేక్ ఆర్డర్ సర్క్యులేట్ అవుతోంది. దానిపై కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు క్లారిటీ ఇచ్చింది.

Advertisement

7th Pay Commission : ఫేక్ లెటర్ లో ఏముందంటే?

ఫేక్ లెటర్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం నుంచి 38 శాతానికి డీఏను పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించిందని ఉంది. జులై 1, 2022 నుంచి 38 శాతం డీఏతో కేంద్రం డీఏను చెల్లించనుందని.. కేంద్రం జీవో జారి చేసినట్టుగా వాట్సప్ లో వార్త సర్క్యులేట్ అవుతోంది. సెప్టెంబర్ 2022 జీతంతో పాటు డీఏ పెంపు, డీఏ బకాయిలన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నాయని ఆ లెటర్ లో వెల్లడించారు. కానీ.. అటువంటి ప్రకటనేది కేంద్రం ఇంకా చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న డీఏ రేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 4 శాతం డీఏ పెంపును ఆశిస్తున్నారు.

no da hike for central govt employees as per 7th pay commission

Advertisement

ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టుగా కేంద్రం 38 శాతానికి డీఏను పెంచితే పెన్షనర్లకు డీఆర్ కూడా 4 శాతం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనీసం 4 శాతం అయినా డీఏ పెరగాల్సిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు బేసిక్ పే ద్వారా డీఏను లెక్కించనున్నారు. అలాగే.. ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయడం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జీతాలు, పెన్షన్లను రివైజ్ చేయడం కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే జీతాలు, పెన్షన్లను రివైజ్ చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దాని కోసం మరో కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి