Amaravathi : అమరావతిపై జనాలు కూడా ఆశలు వదిలేసుకున్నారా? సీఆర్డీయే భూముల వేలమే దానికి ఉదాహరణ?
Amaravathi : మూడు రాజధానులు అనే అంశం ఇంకా ఏపీలో తెగడం లేదు. అధికార వికేంద్రీకరణ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఒక్క రాజధాని వద్దని.. మూడు రాజధానులు ముద్దని దాని కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ.. మూడు రాజధానులు అమలు కాకుండా కొందరు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. నానా గోల చేశారు. అధికార వికేంద్రీకరణ వద్దని.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని నిరసన కూడా చేశారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఏపీకి మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండాలని.. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి మాత్రం కుంటుపడిపోయింది. అసలు అమరావతిని పట్టించుకునే నాథుడే ఇప్పుడు లేడు. అమరావతి ఒక్కటే రాజధాని అని పరితపించే వాళ్లు కూడా అమరావతిని అస్సలు పట్టించుకోవడం లేదు.
Amaravathi : సీఆర్డీఏ స్థలాల వేలానికి స్పందన లేదు
అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. క్యాపిటర్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ అది. ప్రస్తుతం అథారిటీకి నిధులు కూడా లేకపోవడంతో సీఆర్డీఏ స్థలాలను వేలం వేసేందుకు పూనుకుంది. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి, సొంతంగా నిధులు సమీకరించుకోవడానికి సీఆర్డీఏ స్థలాలను వేలానికి వేస్తే వేలంలో పాల్గొన్నది ఒక్కరు మాత్రమే. వేలం కోసం సీఆర్డీఏ దాదాపు రూ.50 లక్షలు ఖర్చు పెట్టింది. కానీ.. పబ్లిసిటీ ఖర్చులు కూడా ఇప్పుడు మిగల్లేదు.
56.2 ఎకరాలను వేలంలో ఉంచితే కేవలం సీఆర్డీఏ నిర్దేశించిన దానికన్నా ఒక్క కేవలం వంద రూపాయలు ఎక్కువ పెట్టి వేలంలోకి ఆ ఒక్కరు దిగారు. అంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కంపెనీలు కూడా అమరావతి వైపు చూడటం లేదు. ప్రస్తుతం అందరి చూపు ఆ మూడు రాజధానుల వైపే ఉంది. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని చాలామంది సమర్థిస్తున్నందువల్లే అమరావతిని పట్టించుకోవడం లేదా? అనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.