Mango Fruit : మామిడి పండ్లు తినగానే ఈ పనులు చేశారంటే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టే..!
Mango Fruit : మామిడి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. మామిడి పండు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. వేసవిలో దొరికే అద్భుతమైన పండు మామిడి. బాగా దోరగా పండిన మామిడిని తింటే వచ్చే రుచి మామూలుగా ఉండదు. అన్ని పండ్లలోనూ అతి మాధుర్యమైన పండు మామిడి. అందుకే.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ లొట్టలేసుకుంటూ తింటారు మామిడి పండును. మామిడి పండులో ఎన్నో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండులో ఉండే పోషకాలు మరే పండులో ఉండవు. అందుకే.. సీజన్ లో దొరికే మామిడి పండ్లను తినకుండా మాత్రం అసలు వదిలిపెట్టకూడదు.
అయితే.. చాలామంది మామిడి పండ్లను తిన్నాక వెంటనే వేరే ఆహారం తీసుకుంటూ ఉంటారు. అసలు.. మామిడి పండ్లను తిన్న తర్వాత ఏం తినాలి? ఏం తినకూడదు? ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? అనే విషయాలు చాలామందికి తెలియదు. మామిడి పండ్లను తిన్న తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏవి? తినకూడని ఆహారం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
Mango Fruit : మామిడి పండ్లు తినగానే తినకూడని ఆహారం ఇవే
మామిడి పండ్లను తినగానే కొందరు వెంటనే మంచి నీళ్లు తాగుతుంటారు. అసలు.. మామిడి పండ్లు తిన్న తర్వాత వెంటనే మంచి నీళ్లను తాగకూడదు. కనీసం అరగంట పాటు ఆగాల్సి ఉంటుంది. లేదంటే.. కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే.. ఎసిడిటీ బారిన కూడా పడే ప్రమాదం ఉంటుంది. అందుకే.. మామిడి పండ్లను తినగానే వెంటనే నీళ్లు తాగకూడదు.
చాలామంది పెరుగులో కలుపుకొని మామిడి పండ్లను తింటుంటారు. భోజనం చేసేటప్పుడు కూడా మామిడి చెక్కలను పెరుగన్నంలో ముంచుకొని తింటుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే.. ఈ రెండు విరుద్దమైనవి. పెరుగు మనిషి శరీరాన్ని చల్లబరుస్తుంది. మామిడి పండు వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఈ రెండింటినీ కలిపితే.. శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి. అవి శరీరానికి ఎంతో హాని కలుగజేస్తాయి. అందుకే.. పెరుగు, మామిడి పండును రెండింటినీ కలిపి తినకండి.
చాలామంది మామిడి పండు తిన్నాక.. కాకరకాయ కూరతో అన్నం తింటుంటారు. లేదా కాకరకాయ కూరతో అన్నం తిన్నాక మామిడి పండు తింటుంటారు. ఎలాగైనా ప్రమాదమే. ఈ రెండింటికీ అస్సలు పడదు. మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూరను తిన్నారంటూ.. వాంతులు అవ్వాల్సిందే. అలాగే.. మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగకండి. అలా చేస్తే శరీరంలో షుగర్ లేవల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.