Bullet Bandi Song: మొన్న పెళ్లికూతురు.. నేడు నర్స్ బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్… అయ్యో ఇంతలోనే ఆమెకు..? వీడియో వైరల్
Bullet Bandi Song : బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. అనే సాంగ్ తెలుసు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆ పాటే కదా వినిపించేది. ఆ పాటకు ఉన్న ఫాలోయింగ్ మామూల్ది కాదు. ఎక్కడ చూసినా ఆ పాటకు డ్యాన్సులు.. సోషల్ మీడియాలో వీడియోలు.. వామ్మో.. ఇప్పటి వరకు ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదు. అది కేవలం.. పెళ్లికూతురు.. బరాత్ లో పెళ్లి కొడుకు కోసం వేసిన డ్యాన్స్ వైరల్ కావడం. ఈనెల 14న మంచిర్యాల జిల్లాకు చెందిన సాయిశ్రియ పెళ్లి జరిగింది. తన పెళ్లి ముగిశాక.. బరాత్ లో పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే.

nurse dances for bullet bandi song goes viral
కట్ చేస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి లో ఉన్న పీహెచ్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సు జ్యోతి.. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. అనే అదే పాటకు డ్యాన్స్ వేసింది. కానీ.. తను వేసింది.. పెళ్లి కూతురు వేసిన తర్వాత కాదు. ఆగస్టు 15నే చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా పీహెచ్సీలోనే తను డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bullet Bandi Song : ఆ వీడియోను చేసి.. తనకు మెమో జారీ చేసిన వైద్యాధికారి

nurse dances for bullet bandi song goes viral
తను డ్యాన్స్ చేసిన వీడియో.. జిల్లా వైద్యాధికారి దగ్గరికి వెళ్లడంతో.. ఆ వీడియోను చూసిన అధికారి.. తనకు మెమో జారీ చేశాడు. అయితే.. తనకు మెమో జారీ చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏదో సరదాకు చేసిన డ్యాన్స్ కు తనకు మెమో జారీ చేయడం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
