Telangana Elections Results 2023 : సిరిసిల్లలో కేటీఆర్ KTR కు షాక్.. 60పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్..!!
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : సిరిసిల్లలో కేటీఆర్ KTR కు షాక్.. 60పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్..!!
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. ఈవీఎం లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎం తొలి రౌండ్ ఓట్లు చూసుకుంటే కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7, ఎంఐఎం ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఇక.. సిరిసిల్లలో కేటీఆర్ కు షాక్ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. కొడంగల్ లో 1365 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 3256 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాగర్ కర్నూల్ ఓ తొలి రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్ 510 ఓట్ల ఆధిక్యంలో ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. హుజురాబాద్ లో ఈటల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 92 నియోజకవర్గాల్లో లీడ్ చూస్తే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో తుమ్మల ఆధిక్యంలో ఉన్నారు. సనత్ నగర్ లో 933 ఓట్ల ఆధిక్యంలో తలసాని ఉన్నారు. కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసే సరికి రేవంత్ కు 4389 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. వైరాలో 3400 ఓట్లతో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ లీడ్ లో ఉన్నారు. మక్తల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. నాగార్జునసాగర్ లో 2 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ లీడ్ లో ఉన్నారు. నారాయణపేటలో తొలి రౌండ్ లో కాంగ్రెస్ 421 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నల్గొండ నాలుగో రౌండ్ కు 12 వేల ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి ఉన్నారు. నల్గొండ 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.