Crime News : లవ్ మ్యారేజ్ చేసుకుంటే పాపమా? ముక్కుపచ్చలారని జంటను ఏం చేశారో చూడండి
Crime News : ఈ జనరేషనే వేరు బాస్. ఈ కాలం యూత్ ఎక్కువగా ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులు పెళ్లి చేసేదాకా ఆగడం లేదు. అలాంటి చాలా ఘటనలను మనం చూశాం. చాలామంది తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అది నచ్చక పేరెంట్స్ ఆ జంట మీద దాడి చేయడమో.. ఇంకేదో చేయడమో చేస్తున్నారు. అలాంటి ఘటనలు చాలా చూశాం మనం.

love married couple home burnt by bride family in karimnagar
ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. న్యూస్ లో, పేపర్ లో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా తల్లిదండ్రుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలోని కరీంనగర్ లో చోటు చేసుకుంది. హుజూరాబాద్ లోని ఇందిరా నగర్ కు చెందిన ఓ యువకుడు… ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా అతడిని ప్రేమించింది. కొంత కాలం పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. చివరకు ఎవ్వరికీ చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Crime News : ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి తల్లిదండ్రులు
ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు తెలిసింది. కోపంతో యువతి తల్లిదండ్రులు.. పెళ్లికొడుకు ఇంటిని తగులబెట్టారు. దీంతో అతడి ఇల్లు మొత్తం కాలిపోయింది. తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో కనీసం 5 లక్షల నష్టం వాటిల్లినట్టు యువకుడు తెలిపాడు. వెంటనే ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటన స్థానికంగా అయితే తీవ్ర చర్చనీయాంశం అయింది.