7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాబోయేవి అన్నీ పండుగలే కావడంతో నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా రానుంది. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ పూట డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఒడిశా ప్రభుత్వం డీఏను పెంచింది. డీఏను 3 శాతం పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. […]
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాబోయేవి అన్నీ పండుగలే కావడంతో నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా రానుంది. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ పూట డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఒడిశా ప్రభుత్వం డీఏను పెంచింది. డీఏను 3 శాతం పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచే ప్రతిపాదనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, డీఏలో 3 శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డీఏ 31 శాతంగా ఉంది. 3 శాతాన్ని పెంచితే 34 శాతానికి డీఏ పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు.. జనవరి 1, 2022 నుంచి వర్తించనుంది. ఇప్పటి వరకు ఉన్న 31 శాతాన్ని 34 శాతానికి పెంచనున్నారు.
7th Pay Commission : జనవరి 1, 2022 నుంచి వర్తించనున్న డీఏ పెంపు
జనవరి 1 నుంచి డీఏ పెరగనున్న నేపథ్యంలో 8 నెలల బకాయిలతో పాటు పెరిగిన డీఏ కలిపి వచ్చే నెల జీతంలో ఒడిశా రాష్ట్ర ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నాయి. దీని వల్ల ఒడిశాలో పనిచేసే 4 లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతంగా ఉంది. అంటే.. ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల పెరిగిన డీఏ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానంగా ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏను కేంద్రం త్వరలోనే పెంచనుంది. డీఏ పెంపును ఈ నెలాఖరులోగా పెంచే అవకాశం ఉంది.