Ys Jagan : వైఎస్ జగన్ ఫ్యామిలీపై.. విపక్షాల వింత, విచిత్ర అంచనాలు..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం పట్ల విపరీత అంచనాలకు పోతున్నాయి. ఆయన మళ్లీ జైలుకు పోతారంటూ అత్యాశలు పెట్టుకుంటున్నాయి. అదే జరిగితే ఏపీకి మూడో సీఎం అయ్యే అవకాశం జగన్ సతీమణి భారతికే ఉందని జోష్యాలు చెబుతున్నాయి. కాదు.. కాదు.. ఆ ఛాన్స్ వైఎస్ షర్మిలనే వరించనుందంటూ రకరకాల ప్రచారం చేస్తున్నాయి. దీనికంతటికీ కారణం జగన్ బెయిల్ క్యాన్సిల్ కానుండటమేనని కోర్టు కన్నా ముందే తీర్పును వెల్లడిస్తున్నాయి. వస్తే కొండ వస్తుంది.. పోతే వెంట్రుక పోతుంది.. అనే చిన్న లెక్కతో సీబీఐ న్యాయస్థానంలో జగన్ బెయిల్ రద్దు కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ నే అపొజిషన్ పార్టీలన్నీ నమ్ముకున్నాయి.
ఇదేం వాదనో..
కరోనా టీకాల విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో గానీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి మోడీని నిలదీయలేకపోతున్నారని ఇన్నాళ్లూ విమర్శించిన ప్రతిపక్షాలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక్క మాట మీద ఉండాలని కోరుతూ జగన్ సీఎంలందరికీ లెటర్లు రాసిన సంగతి తెలిసిందే. అలా ఎందుకు చేశాడంటే రేప్పొద్దున బెయిల్ రద్దయితే కేంద్రంపైన పోరాడుతున్నందుకే తనను మళ్లీ జైలుకి పంపించారని చెప్పుకోవటానికట. ది గ్రేట్ సీపీఐ లీడర్ నారాయణ గారి తాజా రాజకీయ విశ్లేషణ ఇది.
ఆ మీడియా రూటే.. : Ys Jagan
ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే ఎల్లో మీడియా సైతం అల్ప సంతోషం ప్రదర్శిస్తోంది. జగన్ కి మళ్లీ కష్టాలు తప్పవని జాతకాలు చెబుతూ తమలో తామే అదో రకమైన ఆనందం పొందుతున్నాయి. అందుకే రఘురామరాజుకి అర్హతకు మించి తమ ఛానళ్లలో సమయాన్ని, పత్రికల్లో స్పేస్ ని కేటాయిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఆయనకు సపోర్టుగా నిలవటం ద్వారా తమ మనసులోని ఫీలింగ్స్ ని పరోక్షంగా బయటపెట్టకున్నాయి. ఒక్క జగన్ ని చూసి ఇంత మంది తమ భుజాలను సర్దుకుంటున్నారని ఇట్టే తెలిసిపోతోంది. తెలుగుదేశం కరపత్రికలా రాతలు రాసే ఒక న్యూస్ పేపర్.. ఏపీలో అధికారం చేజారిపోయినందుకు ఆ పార్టీ కన్నా ఎక్కువ బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. దాని అధినేత అనుక్షణం జగన్ వ్యతిరేక వార్తలకే ప్రధాన్యం ఇస్తున్నాడు. వైఎస్ షర్మిల వెనక ఒక పెద్ద నేషనల్ పార్టీ ఉందని(కాంగ్రెస్ కాదు), అదే జగన్ భవిష్యత్తును శాసించబోతోందని కథనాలు అల్లుతోంది. అయితే తమకు జనం మద్దతు ఉన్నంత కాలం ఇలాంటి కుట్రలు చెల్లబోవని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.