Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట బొప్పాయి తినడం, శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు అందించే బొప్పాయి, రుచి, ఆరోగ్యం రెండింటినీ కలిపిన సంపూర్ణ పండు.

#image_title
రాత్రిపూట బొప్పాయి తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగవుతుంది
బొప్పాయిలో ఉండే పాపైన్ (Papain) అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా జీర్ణించేందుకు సహాయపడుతుంది. రాత్రిపూట తిన్న భోజనం సులభంగా జీర్ణమవుతూ, అజీర్ణం, అమ్మ వచ్చుట, గాస్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
మలబద్ధకానికి చెక్
బొప్పాయిలో పుష్కలంగా ఉండే ఫైబర్, మలాన్ని సాఫీగా బయటకు పంపేలా చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. నిద్రకు ముందు తినడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి సూపర్ ఫుడ్
ఒక చిన్న బొప్పాయిలో కేవలం 60-70 కేలరీలు మాత్రమే ఉంటాయి. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, నీరు ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది.
ఇమ్యూనిటీ బలపడుతుంది
విటమిన్ C బొప్పాయిలో అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తరచూ జలుబు, దగ్గుతో బాధపడే వారు దీనిని అలవాటు చేసుకోవాలి.
చర్మానికి మెరుగు
విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. రాత్రిపూట తినడం వల్ల మీ చర్మానికి రాత్రంతా “నేచురల్ స్కిన్ కేర్” లాంటి ప్రభావం ఉంటుంది.