KCR : సీఎం కేసీఆర్ పై మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు?
KCR : తెలంగాణలో రాజకీయాలన్నీ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. అసలు.. ఏనాడూ తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పై పల్లెత్తు మాట అనని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు… తాజాగా తమ అసంతృప్తులను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్… సీఎం కేసీఆర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ కూడా సంక్షేమ పథకాల విషయంలో, పేదల విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రసమయి, ఈటల.. ఇద్దరినీ సీఎం కేసీఆర్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఈటలతో సీఎం కేసీఆర్ భేటీ అయినట్టు తెలుస్తోంది కానీ… ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది బయటికి తెలియలేదు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే… ఆయన కావాలని కేసీఆర్ ను అన్నారా? లేక అలా అనుకోకుండా ఆయన పేరు వచ్చిందో తెలియదు కానీ…. రైతులు చేస్తున్న ధర్నాపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు…. సీఎం కేసీఆర్ పై కూడా విమర్శల వర్షం గుప్పించారు ఆ ఎమ్మెల్యే.
KCR : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డే ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి. ఆయన గురువారం రోజున…. పరకాల నియోజకవర్గంలోని కంఠాత్మకూరుకు వెళ్లారు.
అక్కడ పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ….. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ చుట్టూ గత కొన్ని రోజులుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నా… ప్రధాని మోదీ, కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అంతటి పుణ్యాత్ములు వీళ్లు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.