Vizag Steel Plant : పవన్, నాదెండ్లవన్నీ ఉత్తమాటలేనట? వీళ్ల మాటలను కేంద్రంలో పట్టించుకునేవాళ్లేలేరట?
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పలు పార్టీలు కేంద్రానికి వినతి చేసినా కేంద్రం పట్టించుకునేలా లేదు. బీజేపీతో దోస్తీ కట్టిన జనసేన కూడా కేంద్రానికి తగు విధంగా నచ్చజెప్పింది. కేంద్ర పెద్దలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్.. ఇద్దరూ కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలంటూ వినతిపత్రాలు సమర్పించినా.. ఏ ఉపయోగం లేదు.
అయితే.. వీళ్ల మాటలను అసలు కేంద్రం ఖాతరు చేయడం లేదని.. అందుకే.. ఇక్కడికి వచ్చి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే అధికారం.. వైసీపీ చేతుల్లోనే ఉందటూ మొత్తం వైసీపీ మీదికి నెట్టేశారు. వైసీపీ తలుచుకుంటే ప్రైవేటీకరణ ఆగుతుందని.. పవన్, మనోహర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కానీ.. పవన్, నాదెండ్ల మరిచిపోయిన ఒక విషయం ఏంటంటే.. అసలు.. జనసేన పొత్తు పెట్టుకున్నదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో. వీళ్లు పొత్తు పెట్టుకున్న పార్టీ వీళ్ల మాట వినదు కానీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చెబితే.. విశాఖ ప్రైవేటీకరణ ఆగిపోతుందా? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
Vizag Steel Plant : వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్న జనసేన నేతలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన నేతలు, పవన్, నాదెండ్ల వాస్తవాలను విరుద్ధంగా, దూరంగా మాట్లాడుతున్నారని.. సీఎం జగన్ వల్లనే ఇది అవుతుంది అంటూ ఆయన మీదకు నెట్టేయడం ఎంతవరకు సమంజసం అంటూ పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినవస్తున్నాయి.
నిజానికి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే బాధ్యత ఎక్కువగా జనసేన మీదనే ఉంది. జనసేన… బీజేపీతో కలిసి మున్ముందు కూడా సాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. జనసేన పార్టీ దీనిమీద పోరాటం చేయాలి కానీ.. వేరే వాళ్ల మీదకు నెట్టేసి వీళ్లు చేతులు దులుపుకోవడం దేనికి నిదర్శనం అంటూ సామాన్య జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇలా చేస్తే భవిష్యత్తులో ఏపీలో జనసేన పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోవాల్సిందే.. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. తన వల్ల అయినంత పోరాడాలి కానీ.. చేతులెత్తేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.