Pawan Kalyan : చిరంజీవిని వదలని రాజకీయ జాడ్యం పవన్ కళ్యాణ్.?
Pawan Kalyan : ‘రాజకీయ జాడ్యం’ అనేంత పెద్ద మాట ఎందుకు ప్రయోగించాల్సి వస్తోంది.? చిరంజీవిని వెన్నుపోటు పొడిచిన పవన్ కళ్యాణ్.. అని మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు వ్యాఖ్యానించినట్లు.? రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. అడ్డగోలు విమర్శలూ సర్వసాధారణమే అయిపోయాయి. అయితే, అన్నయ్య చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లాగుతున్నట్లు.? ఇదే మెగాభిమానుల్లోనూ చాలామందిని ఆవేదనకు గురిచేస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చి వుండాలి.. చిరంజీవి అభిమానులూ జనసేనకు ఓటు వేసి వుంటే. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జనసేన పార్టీకి ఓట్లెయ్యకపోవడం వల్ల జనసేన అత్యంత దారుణంగా ఓడిపోయింది.
జనసేన ఓడిపోవడానికి వున్న బలమైన కారణాల్లో, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా అతి ముఖ్యమైన కారణమంటారు రాజకీయ విశ్లేషకులు చిరంజీవి పేరుని రాజకీయాల్లో ప్రస్తావించడం ద్వారా, చిరంజీవి స్థాయిని పవన్ కళ్యాణ్ తగ్గించేస్తుంటారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవిని కొంతమంది తప్పుదోవ పట్టించారని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. అది చిరంజీవి స్థాయిని తగ్గించడమే అవుతుంది. సొంత తమ్ముడై వుండి, ప్రజారాజ్యం పార్టీని ముందుగానే (2009 ఎన్నికలు అయిపోగానే) పవన్ ఎందుకు వదిలేసినట్టు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తాజాగా పవన్ కళ్యాణ్, తన సోదరుడు చిరంజీవిని పరోక్షంగా విమర్శించినట్లయియింది..
ఆయన చెప్పిన ‘పిట్ట’ కథలో.! పిట్ట అయితే, చెట్టు మీద నుంచి ఎగిరిపోతుంది.. నేను చెట్టు లాంటోడ్ని.. ప్రజల్ని వదలను.. రాజకీయాల్ని వదలను.. భూమిని వేళ్ళతో సహా బలంగా పట్టుకున్న చెట్టలా రాజకీయాల్లో వుంటానని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అది, చిరంజీవికి అన్వయించి చూస్తే.. చిరంజీవి ప్రజారాజ్యం అనే చెట్టు మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అనే చెట్టు మీదకి దూకేసి, ఆ తర్వాత ఆ చెట్టుని కూడా వదిలేశారని అనుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎవర్ని ఉద్దేశించి పిట్టకథ చెప్పినా, అది చిరంజీవి వైపుకు తిరిగింది. వై దిస్ కొలవెరి పవన్ కళ్యాణ్.?