Janasena : నాదెండ్లకు జనసేనలో ప్రాధాన్యం తగ్గిందా? పవన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
Janasena : నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీలో కీలక నేత. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి నాదెండ్ల అని చెప్పుకోవచ్చు. అయితే… నాదెండ్ల మనోహర్ పార్టీలో ఉండటం… కొందరు పవన్ అభిమానులకు నచ్చడం లేదు. అది ఇప్పటి గొడవ కాదులే… పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నదే. అయితే… పవన్ ఇదివరకు నాదెండ్ల ఏది చెబితే దానికి తల ఊపేవారు అనే వార్త కూడా ప్రచారంలో ఉండేది.

pawan kalyan big shock to nadendla manohar
నాదెండ్లకు పవన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం కూడా కొందరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి గిట్టేది కాదు. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పవన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సొంతంగా తీసుకుంటున్నారట. తన సొంత నిర్ణయం మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారట. అసలు.. జనసేన నేతల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా.. పవన్ కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నారనే విమర్శలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి.
కొన్ని విషయాల్లో చాలామంది నేతలు పవన్ మాటను జవదాటరు. తూచా తప్పకుండా ఆయన మాటను వింటారు. కానీ.. పవన్ మాత్రం జనసేన నేతల మాటలకే విలువివ్వడం లేదట. పార్టీలో కొన్ని కీలక పదవుల విషయంలోనూ, నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించే విషయంలోనూ పవన్ కొన్ని తప్పులు చేస్తున్నారంటూ పార్టీలో ఎక్కువగా చర్చ నడుస్తోంది.
మరోవైపు చాలామంది పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. పవన్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది.నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా తొందరపడ్డారని… నాదెండ్ల పార్టీలోకి వచ్చాక జనసేనలో సమస్యలు ఎక్కువయ్యాయని… అయినప్పటికీ పవన్ కళ్యాణ్… నాదెండ్ల విషయంలో చూసీ చూడనట్టు వదిలేయడంతో అవి ఇంకాస్త ఎక్కువయ్యాయనే భావన కూడా ఉంది.
Janasena : గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నాదెండ్లను ప్రకటించే అవకాశం
అందుకే పవన్ కళ్యాణ్… నాదెండ్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నాదెండ్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. నాదెండ్ల మనోహర్ ప్రాధాన్యతను పార్టీలో తగ్గించడం కోసం పవన్ కళ్యాణ్ ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే… పార్టీలో ఆయన జోక్యాన్ని తగ్గించడం కోసం, కొన్ని నిర్ణయాలను తనే తీసుకొని… వాటిని త్వరలోనే ప్రకటించనున్నారట. అందుకే గుంటూరుతో పాటు తెనాలి నియోజకవర్గానికి అభ్యర్థిని కూడా ముందే ప్రకటిస్తారట పవన్. అలాగే… ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను నియమించే విషయంపై కూడా ఓ కీలక నిర్ణయం తీసుకొని పవన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.