Pawan Kalyan : యువత దయచేసి దండం పెట్టి చెబుతున్నాను జగన్ కి ఓటేయకండి పరోక్షంగా అంటూ పవన్ విమర్శలు వీడియో వైరల్..!!
Pawan Kalyan : మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సభ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికారం ఒక కులానికే పరిమితం కాకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువత కులాల కుంపటి నుండి బయటకు రావాలని సూచించారు. సమాజంలో ఒకరి అవసరం మరొకరికి ఉంటుందని అన్నారు. వంగవీటి రంగా గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మా ఇంటికి వచ్చిన సమయంలో టీ ఇవ్వడం జరిగింది.
ఆయన కాపులందరికీ ఆరాధ్య దైవం నేను అర్థం చేసుకోగలను. కానీ ఆయన భార్య కమ్మ కులానికి చెందిన వ్యక్తి. వాళ్ళిద్దరికీ పుట్టింది రాదా. అయితే ఆయనకు అడ్డురాని కులం పట్టుకుని మీరందరూ ఎందుకు తన్నుకు చేస్తారు. దయచేసి మార్పు రావాలి. నెక్స్ట్ తరం మీరే. కాబట్టి కులాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయకండి. మీకు దండం పెట్టి చెబుతున్నాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి మంచివాడే అయితే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. దయచేసి ఈసారి ఎన్నికలలో జనసేనకి మద్దతుగా నిలబడాలి.
ప్రతిభవన్న యువతకు విద్య భారం కాకుండా చూసుకునే బాధ్యత నాది. మీకు కూలివాడిగా పనిచేస్తాను. మీ కుల పెద్దల చేత మీకు పని చేయించే బాధ్యత నాది. ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం. ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనం నివసించే సమాజంలో అందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. నేను తీసే సినిమా ఒక కులం వాళ్లు చూస్తే నేను స్టార్ కాలేదు. కాబట్టి అందరూ వచ్చే ఎన్నికలలో కులాలకతీతంగా… ముఖ్యంగా యువత ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.