Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో జనసేన ఆ పార్టీతో పొత్తు..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. తన సినీ ఇమేజ్ ను రాజకీయాల్లో ఉపయోగించుకుంటూ.. రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. కానీ.. ఆయనకు 2019 ఎన్నికల్లో తీవ్రమైన దెబ్బ పడింది. 2019 ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేసినా.. గెలిచింది ఒక్కటంటే ఒక్క సీటు. అంటే రాజకీయాల్లో రాణించాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని అప్పుడే తెలిసొచ్చింది. అయితే.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టి.. చంద్రబాబును తన సినీ ఇమేజ్ తో గెలిపించగలిగిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం గెలవలేకపోయారు.
అందుకేనేమో… ఏపీలో బీజేపీతో దోస్తీ కుదుర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. బీజేపీతో కలిసి నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతోనే పవన్ కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టి పెడుతున్నారట. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయాలని భావించింది కానీ.. చివరి నిమిషంలో తప్పుకుంది. తెలంగాణలోనూ తన పార్టీని విస్తరించాలనేదే పవన్ కళ్యాణ్ ప్లాన్. అందుకే.. 2023 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కు ఒక పార్టీ స్నేహ హస్తం అందిస్తోంది.. అంటూ వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan : తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి జనసేన వైపు చూస్తున్న టీఆర్ఎస్
అయితే.. తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ బాగానే కష్టపడుతోంది. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడం కోసం.. వాటికి దీటుగా సమాధానం చెప్పడం కోసం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్నేహ హస్తం అందిస్తోందట. నిజానికి.. 2018 లో జరిగిన ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణలో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నమాట మాత్రం వాస్తవం. అందుకే.. టీఆర్ఎస్ పార్టీ కూడా జనసేనతో కలిసి జతకట్టాలని భావిస్తోందట. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి.. టీఆర్ఎస్ పార్టీకి, జనసేన పార్టీకి మధ్య అంతగా విభేదాలు కూడా లేవు. పవన్ కళ్యాణ్ కూడా టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసింది లేదు. మెగా ఫ్యామిలీకి కేసీఆర్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు తెలంగాణలో కలిసి నడిస్తే తప్పేంటి.. అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి.. ఇటు టీఆర్ఎస్ అభిమానుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా.. జనసేనాని ఈ అడుగు ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి.