Modi – Pawan Kalyan : మోడీని కాన్ఫిడెంట్ గా ముంచేస్తోన్న జనసేనాని !
Modi – Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ఈనేపథ్యంలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా వైసీపీ వైపే ఏపీ ప్రజలకు మొగ్గు చూపుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయినా కూడా వైసీపీని ఓడించే పరిస్థితులు లేవు. అయినా వేరే ఆప్షన్ లేదు కదా. అందుకే.. అధికార వైసీపీ పార్టీని ఓడించడం కోసం జనసేన, టీడీపీ, బీజేపీలు కలవబోతున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఢీకొట్టబోతున్నాయి.
నిజానికి జనసేన, బీజేపీ పొత్తు ఎప్పుడో ఖరారు అయింది. కానీ.. బీజేపీతో కలిసి జనసేన ప్రస్తుతం పని చేయడం లేదు. కానీ.. ఎన్నికల వరకు బీజేపీతో మాత్రమే కాదు.. టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. అయితే.. తాజాగా వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడుతోంది. టీడీపీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతోంది.
Modi – Pawan Kalyan : ఒకవేళ బీజేపీ లేదా టీడీపీ వద్దనుకుంటే?
కానీ.. బీజేపీ పార్టీ మాత్రం పొత్తుల విషయంలో ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనా.. బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తే అది ఖచ్చితంగా బీజేపీకి మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఏపీలో బీజేపీ జనసేన పార్టీ వల్ల తీవ్రంగా నష్టపోతుంది అనే విషయం బీజేపీకి అర్థం అయిందో లేదో. అయితే.. జనసేన పార్టీ సొంతగా నిలబడి గెలిచే అవకాశాలు లేవు. ప్రస్తుతం జనసేన పార్టీకి మా.. అంటే 25 శాతం ఓట్లు వస్తాయి కానీ.. అవి దేనికీ పనికిరావు. అదే వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏదైనా ఫైదా ఉండొచ్చు. అందులోనూ ప్రస్తుతం తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవడం లేదని.. వైసీపీ పార్టీని ఓడించడమే తన ప్రధాన కర్తవ్యం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.