పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్.. నిలకడగా ఆరోగ్యం

0
Advertisement

pawan kalyan : పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డట్లుగా వచ్చిన వార్తలు నిజమే అంటూ అధికారిక ప్రటకన వచ్చింది. గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలకు సస్పెన్స్‌ కు తెర పడ్డట్లయ్యింది. పవన్‌ కళ్యాణ్ నిజంగానే కరోనా బారిన పడ్డారంటూ అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన టీమ్‌ హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేశారు. అందులో పవన్ టీమ్‌ స్పందిస్తూ.. పవన్‌ కు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఇటీవల నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొదట ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.

pawan kalyan : పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే

మెగా ఫ్యామిలీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి – శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు.

Pawan-kalyan
Pawan-kalyan

తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన సుమన్ పాండిచ్చేరిలో వైద్య విద్యను అభ్యసించారు. కాకినాడకు చెందిన ప్రముఖులు శ్రీ తోట హనుమంతరావు గారి మనవరాలు డా. కావ్యను డా.సుమన్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డా. సుమన్ అత్యంత ఆప్తులు. ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్ గా ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా డా.సుమన్ – శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటే ఉండి తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. నిర్మాత శ్రీ నాగ వంశీ గత వారం రోజులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారు.

Advertisement