Pawan Kalyan : పొత్తుల విషయంలో బీజేపీ ఫుల్ క్లారిటీ.. పవన్ కళ్యాణ్ కే రావాలి
Pawan Kalyan : ఏపీలో 2024 ఎన్నికల పొత్తుల విషయమై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైకాపా కు 2019 లో అద్బుతమైన విజయాన్ని అందించిన ఏపీ ప్రజలు మరోసారి సీఎంగా జగన్ ను కోరుకుంటున్నారనే సర్వే ఫలితాలు రావడంతో తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు పొత్త పేరుతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అయితే బీజేపీ మాత్రం అందుకు ఆసక్తిగా లేదు. ఇప్పటికే బీజేపీ మరియు జనసేన పార్టీ లు పొత్తులో ఉన్న విషయం తెల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం అయితే ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.
బీజేపీ తో గతంలో పొత్తు పెట్టుకుని పదవులు అనుభవించి ఆ తర్వాత మోడీని మరియు అమిత్ షాను విమర్శించిన తెలుగు దేశం పార్టీ ని ఇప్పుడు బీజేపీ దగ్గరకు రానివ్వకూడదు అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తో పొత్తు విషయంలో ఆలోచించేది లేదని.. తెలుగు దేశం పార్టీ విధానాల వల్ల ఏపీ చాలా నష్టపోయింది. మళ్లీ వారు అధికారంలోకి వస్తే మరింతగా రాష్ట్రం వెనక్కు వెళ్లి పోతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తుందట. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసేది లేదు అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తేల్చి చెప్పేశాడు.జనసేన మాత్రం తెలుగు దేశం పార్టీ తో పొత్తు కోసం ఉవ్విల్లూరుతోంది.
తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిస్తే అద్బుతాలు ఆవిష్కారం అవుతాయని కొందరు నమ్ముతున్నారు. కాని జనసేన తో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీకి మాత్రం తెలుగు దేశం పార్టీ పై అస్సలు ఆసక్తి లేదని తేలిపోయింది. పొత్తుల విషయంలో బీజేపీ ఫుల్ క్లారిటీగా ఉంది. కాని పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ రూట్ మ్యాప్ ను అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ అయ్యి తెలుగు దేశం పార్టీ తో వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. ఆయన బీజేపీతో పొత్తు కావాలి అనుకుంటే ఖచ్చితంగా టీడీపీ కి దూరం అవ్వాల్సిందే అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి పవన్ ఏం చేస్తాడు అనేది చూడాలి.