YSRCP : ఇప్పుడు బీసీల పార్టీ టీడీపీ కాదు వైకాపా
YSRCP : తెలుగు దేశం పార్టీ ప్రారంభించిన సమయంలో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ బీసీల పార్టీ అంటూ ప్రకటించాడు. అప్పటి నుండి రాష్ట్రంలో బీసీల కంటూ ఒక పార్టీ ఉంది.. అది తెలుగు దేశం పార్టీ అనే అభిప్రాయం జనాల్లో ఉండేది. అయితే కాల క్రమేనా తెలుగు దేశం పార్టీ చేతులు మారడం.. పార్టీలో నాయకత్వం మారడం వల్ల బీసీలకు ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో బీసీలకు ఉన్న స్థానం గురించి ఆ పార్టీ నాయకులే స్వయంగా పెదవి విరుస్తూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం ఉంది.
ఒక వైపు తెలుగు దేశం పార్టీ బీసీలకు తమ పార్టీలో ప్రాతినిధ్యం తగ్గిస్తూ.. తమ పార్టీలో ఇతరులకు ప్రాముఖ్యత ఇస్తున్న నేపథ్యంలో వైకాపా మాత్రం తమపై ఉన్న ముద్ర చెడిపేసుకుని బీసీల పార్టీగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో నియామకాల్లో కూడా బీసీలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజక వర్గంలో కూడా బీసీలకు సంబంధించిన ఓటర్ల నుండి మొదలుకుని నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వైకాపా విషయంలో ఉన్నారు.
తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇవ్వడం వల్ల ఎంతటి ప్రాముఖ్యతను వైకాపా బీసీలకు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. బీసీల కోసం పోరాటం సాగిస్తున్న వ్యక్తికి ఆ గౌరవం ఇవ్వడం అంటే అది మరింత అభినందనీయం. తమ పార్టీలో వారికి కాకుండా బయటి వారికి ఇలా పార్టీకి సంబంధించిన కీలక పదవులు ఇవ్వడం ద్వారా బీసీలను తాము ఎంతగా అక్కున చేర్చుకున్నామో తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇప్పుడు బీసీల పార్టీ తెలుగు దేశం పార్టీ కాదు బీసీల కోసం వైకాపా ఉందని జనాలు నమ్ముతున్నారు.